Advertisementt

బాలయ్యా.. ఆదిత్య 999 ఏం చేస్తారు!

Wed 11th Mar 2026 11:06 AM
balakrishna  బాలయ్యా.. ఆదిత్య 999 ఏం చేస్తారు!
Balakrishna - Aditya 999 బాలయ్యా.. ఆదిత్య 999 ఏం చేస్తారు!
Advertisement
Ads by CJ

నందమూరి నటసింహ బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK 111 ప్రాజెక్ట్ ని సైలెంట్ గా ట్రాక్ లోకి ఎక్కించేసి రెగ్యులర్ షూట్ కి వెళ్లిపోయారు. ఈ చిత్రంలో మంచు మనోజ్ విలన్ గా కనిపిస్తారని న్యూస్ ఉండగా.. హీరోయిన్ గా నయనతార నటిస్తుంది.

అయితే నందమూరి బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని ఆదిత్య 369 కి సీక్వెల్ గా ఆదిత్య999 చేస్తారని.. దరకుడిగా క్రిష్ ఉంటారని అన్నారు. ఘాటీ తర్వాత క్రిష్ పేరు ఆదిత్య 999 విషయంలో వినిపించడం లేదు. మరోపక్క బాలకృష్ణ ఆదిత్య 999 ద్వారానే తన కొడుకు మోక్షజ్ఞ ను ఇండస్ట్రీ కి ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్పారు.

ఇప్పుడు బాలయ్య కి కథలు చెప్పే దర్శకులు ఎక్కువయ్యారు. అందులో కొరటాల, వివేక్ ఆత్రేయ తో పాటుగా విశ్వంభర దర్శకుడు వసిష్ఠ చేరాడు అని.. వసిష్ఠ చెప్పిన కథకు బాలయ్య కనెక్ట్ అయ్యారనే న్యూస్ వినిపిస్తుంది. విశ్వంభర తర్వాత వసిష్ఠ రవితేజ తో సినిమా అనుకున్నారు, ఇప్పుడు ఆ లైన్ లోకి బాలయ్య చేరారు అంటున్నారు.

ఇది విన్న నందమూరి అభిమానులు బాలయ్యా.. మరి ఆదిత్య 999 ని ఏం చేయాలనుకుంటున్నారు. మీరు అది లేట్ చేస్తే.. మోక్షు ఎంట్రీ ఇంకా ఆలస్యమైపోతుంది.. కాస్త ఆలోచించమని రిక్వెస్ట్ చెయ్యడం హాట్ టాపిక్ అవుతోంది. 

Balakrishna - Aditya 999:

Nandamuri Balakrishna 

Tags:   BALAKRISHNA
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ