ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్స్ లో ఎవ్వరికి లేని క్రేజీ లైనప్ ప్రభాస్ కి ఉంది. వరస సినిమాలు, రెండు మూడు సినిమాల షూటింగ్స్ తో ప్రభాస్ బిజీ ఎలాంటిదో అందరికి తెలుసు. ఒకేసారి సందీప్ రెడ్డి వంగ తో స్పిరిట్ తో పాటుగా హను రాఘవపూడి తో కలిసి ఫౌజీ షూటింగ్ చేస్తున్న ప్రభాస్ త్వరలోనే నాగ్ అశ్విన్ కల్కి 2 సెట్ లోకి వెళ్ళబోతున్నారు.
ఇంత బిజీగా వున్న ప్రభాస్ లైనప్ లో సలార్2 అలాగే ప్రశాంత్ వర్మ మూవీ ఉండనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ప్రభాస్ ఓ క్రేజీ దర్శకుడిని మీట్ అవడం హాట్ టాపిక్ అయ్యింది. మలయాళ దర్శకుడు దింజిత్ అయ్యత్తన్ ప్రభాస్ ని కలవడం, ఆయనతో మీటింగ్ పెట్టడంతో ప్రభాస్ మలయాళ దర్శకుడికి కనెక్ట్ అవుతున్నారా అంటూ సోషల్ మీడియాలో ఒకటే గుసగుసలు.
మలయాళ క్రేజీ డైరెక్టర్ దింజిత్ అయ్యత్తన్ ప్రభాస్ తో కలిసి ఉన్న ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. సూపర్‌స్టార్ ప్రభాస్ తో అద్భుతమైన సమయం గడిపాను. సరదా కబుర్లతో సాయంత్రం హాయిగా గడిచిపోయింది. ముఖ్యంగా ప్రభాస్ వడ్డించిన ప్రాన్స్ రొయ్యల బిర్యానీ టేస్ట్ బాగుంది.
నిజంగా నాకు ఇంత మంచి ఆతిథ్యం ఇచ్చిన ప్రభాస్ సార్‌కి, ఈ మీటింగ్ ఏర్పాటు చేసిన విజయ్ సార్‌కి, అలాగే హోంబలే ఫిల్మ్స్‌కి స్పెషల్ థ్యాంక్స్ అంటూ రాసుకొచ్చారు. మరి ప్రభాస్ కి హోంబలె నిర్మాణ సంస్థ తో కమిట్మెంట్స్ ఉన్నాయి. అందులో భాగంగా ప్రభాస్ తో ఈ డైరెక్టర్ కి హోంబలె వాళ్ళు మీటింగ్ ఏర్పాటు చెయ్యడం వెనుక సినిమా కాక ఇంకేముంటుంది.




తీవ్ర విషాదంలో బిగ్ బాస్ డెమోన్ పవన్ 
Loading..