జన నాయకన్ కు మోక్షం లభిస్తుందా

Jana NayaganJana Nayagan

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ జన నాయకన్ చివరి చిత్రం ఈ ఏడాది పొంగల్ బరిలో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ సెన్సార్ ఇష్యుస్, కోర్టు గొడవలతో జన నాయకన్ చిత్రం విడుదల లేట్ అవుతూ వస్తుంది. ఇదిగో రిలీజ్ అదిగో రిలీజ్ అంటూ చెప్పడమే కానీ జన నాయకన్ కు మోక్షం కలగడం లేదు. మధ్యలో ఈ చిత్ర నిర్మాతలు కేవీ ప్రొడక్షన్ వారు ఆర్ధికంగాను, అభిమానుల ఒత్తిడితో నలిగిపోతున్నారు. 

కేవీ ప్రొడక్షన్ వారు నిర్మించిన మరో భారీ సినిమా యష్ టాక్సిక్ చిత్రం కూడా జూన్ కి వాయిదా పడడంతో.. ఈ నిర్మాతలు జన నాయకన్ పై ఫోకస్ పెట్టి టాక్సిక్ చిత్రం రిలీజ్ అవ్వాల్సిన మార్చ్ 19 కి జన నాయకన్ విడుదల చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారట. విడుదలకు సమయం తక్కువే అయినా ఎలాగైనా ఆ డేట్ కి రావాలని చూస్తున్నారట.

ఇవాళ చెన్నైలో రివైజింగ్ కమిటీ జన నాయకుడు ఎడిటింగ్ వెర్షన్ చూడాల్సి ఉందట. ఒక వేళ అది సానుకూలంగా వస్తే ఎట్టి పరిస్తితుల్లో మార్చ్ 19 కి సినిమా రిలీజ్ చెయ్యాలని అటు జన నాయకన్ బయ్యర్లు, ఇటు విజయ్ అభిమానులు మేకర్స్ ని కోరుతున్నారట. ఎట్టి పరిస్థితుల్లో సినిమా విడుదల చేస్తే అన్ని విషయాల్లో తోడు ఉంటామని అభిమానులు, బయ్యర్లు మేకర్స్ కు హామీ ఇస్తున్నారట. దీనిని బట్టి ఇప్పటికైనా జన నాయకన్ కి ఇప్పటికైనా మోక్షం లభిస్తుందేమో చూడాలి. 

VIjay Jana Nayagan

jana nayagan