స్టార్ హీరోల పారితోషికాలు ఏ రేంజ్లో ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు. సినిమా బడ్జెట్ ను బట్టి పారితోషికం ఆకాశన్నంటుతుంది. పాన్ ఇండియా సినిమా అంటే వంద కోట్ల పైమాటే. రీజనల్ మార్కెట్ అంటే? 30-40 కోట్ల మధ్యలో అందుకుంటున్నారు. టాలీవుడ్ లో ఉండే రెగ్యులర్ నిర్మాతల నుంచి అయితే ఈ మాత్రమే. వీరి నుంచి ఎక్కువ డిమాండ్ చేయడానికి ఉండదు. ఎందుకంటే బాగా తెలిసిన వారు కావడం.
తారస పడితే? ముఖ ముఖాలు చూసుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి పారితోషికంలో మరీ డిమాండ్ చేయలేరు. అదే కార్పోరేట్ సంస్థలు సినిమా నిర్మిస్తున్నాయాంటే మాత్రం సన్నివేశం పూర్తి భిన్నంగా ఉంటుందని వెలుగులోకి వచ్చింది. సినిమా బడ్జెట్ లో 70 శాతం పారితోషికాలకే ఖర్చు అవుతుందిట. అందులో హీరో పారితోషికమే 40 శాతానికి పైగా ఉంటుందిట.
కార్పోరేట్ సంస్థ ను బట్టి హీరో పారితోషికం డిమాండ్ చేస్తాడని అంటున్నారు. ఈ విషయంలో హీరోలు ఎంత మాత్రం రాజీ పడరుట. అందుకు ఓ బలమైన కారణం కూడా వినిపిస్తుంది. కార్పోరేట్ సంస్థలు సినిమాను ఓ వ్యాపారంలా భావిస్తాయి అన్నది కాదనలేని నిజం. కార్పోరేట్ సంస్థలేవి సినిమాను ఫ్యాషన్ తో నిర్మించవు.
సాధారణ ప్రేక్షకుడి కోణంలో అసలే కనిపించదు. కార్పోరేట్ తో సినిమా అంటే పూర్తిగా బిజినెస్ మోడల్ లోనే సినిమా ఉంటుంది. సినిమా పట్టాలెక్కిన తర్వాత మధ్యలో క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చినా? క్లియర్ అవ్వడం అంత సులభం కాదు. బిగ్ బాస్ విదేశాల్లో ఉండే ఆపరేట్ చేస్తుంటాడు. ఈ ప్రోసస్ లో కొంత డిలే అవుతుంది. అలా జరిగితే హీరోకు లాస్. అందుకే హీరోలు పారితోషికం విషయంలో కార్పోరేట్ సంస్థల వద్ద ఎంత మాత్రం రాజీ పడరని తెలుస్తోంది.




నేనెవరిని టార్చర్ చెయ్యలేదు - షణ్ముఖ్ 

Loading..