Advertisementt

ఫ్రైడే - డ్రై డే

Sat 07th Mar 2026 11:33 AM
mrityunjay  ఫ్రైడే - డ్రై డే
Friday movie result ఫ్రైడే - డ్రై డే
Advertisement
Ads by CJ

ఫిబ్రవరి నెల మొత్తం సో సో గా గడిచిపోయింది. సూపర్ హిట్ సినిమా ఒక్కటి కూడా లేకుండానే ఫిబ్రవరి నెల వెళ్ళిపోయింది. మార్చి మొదలైంది.. ఆశలు చిగురించాయి. కానీ మార్చ్ మొదటి వారము ఆడియన్స్ ను డిజప్పాయింట్ చేసింది. ఈ శుక్రవారం విడుదలైన ఒక్క సినిమా కూడా థియేటర్స్ లో సౌండ్ చెయ్యలేదు.

మంచి ప్రమోషన్స్ తో మార్చ్ 6 న విడుదలైన శ్రీ విష్ణు మృత్యుంజయ్ హిట్ అవుతుంది అనుకుంటే.. అది కూడా సో సో రిజల్ట్ తో ప్రేక్షకులను నిరాశపరిచింది. వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కి, అదిరిపోయే ప్రమోషన్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సరస్వతి కూడా ప్రేక్షకులను ఇంప్రెస్స్ చెయ్యలేకపోయింది.

ముందు ఓటీటీ అంటూ సినిమా షూటింగ్ ను ఫినిష్ చేసి లాస్ట్ మినిట్ లో థియేట్రికల్ రిలీజ్ అన్న శివాజీ-లయ ల సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రం అనవసరం గా థియేటర్స్ లో విడుదలైంది. ఓటీటీ కి వస్తే ఎంతోకొంత వర్కౌట్ అయ్యేది అనేది ఆడియన్స్ అభిప్రాయం. వీటితో పాటుగా పెద్దగా పరిచయం లేని మరో రెండు చిత్రాలు వచ్చాయి.

ఈ వారం విడుదలైన సినిమాలేవీ థియేటర్స్ లో పేలలేదు. ఆడియన్స్ అస్సలు ఇంప్రెస్స్ అవ్వలేదు, చాలా సినిమాలు వచ్చాయి, కానీ వాటిని చూసేందుకు ఆడియన్స్ కరువయ్యారు. అందుకే ఈ ఫ్రైడే డ్రైడే గా మిగిలిపోయింది.

Friday movie result:

Mrityunjay-Saraswathi-Sampradayini Suppini Suddapoosani

Tags:   MRITYUNJAY
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ