Advertisementt

బర్త్ డే స్పెషల్-కాలినడకన తిరుమలకు జాన్వీ

Fri 06th Mar 2026 10:39 AM
janhvi kapoor  బర్త్ డే స్పెషల్-కాలినడకన తిరుమలకు జాన్వీ
Janhvi Kapoor visited Tirumala బర్త్ డే స్పెషల్-కాలినడకన తిరుమలకు జాన్వీ
Advertisement
Ads by CJ

బాలీవుడ్ క్యూటీ జాన్వీ కపూర్ బర్త్ డే ఈరోజు మార్చ్ 6. ఆమె తన పుటిన రోజున తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకోవడం అలవాటు చేసుకుంది. అందుకోసం ఆమె తిరుమల మెట్ల మార్గం ద్వారా వెళ్లి తర్వాత విఐపి బ్రేక్ దర్శనంలో శ్రీవారిని దర్శించుకుంటుంది. అదే ఆనవాయితీని ఈఏడాది కూడా కొనసాగించింది.

తన పిన్ని మహేశ్వరితో కలిసి జాన్వీ కపూర్ తిరుమల వెళ్ళింది. మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకొని ఈరోజు శుక్రవారం మార్చ్ 6 న విఐపి బ్రేక్ దర్శనంలో జాన్వీ కపూర్ శ్రీవారి దర్శనం చేసుకుంది. ఎక్కువగా జాన్వీ కపూర్ తన బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియాతో తిరుమల వెళుతుంది, అలాగే తన పిన్ని మహేశ్వరితోను వెళుతుంది.

ఈఏడాది తన బర్త్ డే కి శ్రీవారి దర్శనం చేసుకున్న జాన్వీ కపూర్ మరో నెలన్నరలో పెద్ది చిత్రంతో పాన్ ఇండియా ప్రేక్షకులను పలకరించనుంది. 

Janhvi Kapoor visited Tirumala:

Janhvi Kapoor visited Tirumala on foot this year to fulfill a vow to Lord Venkateswara

Tags:   JANHVI KAPOOR
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ