Advertisementt

బ్యాక్ టూ బ్యాక్ మీనాక్షి జెండా పాతేసేలా

Sat 28th Feb 2026 10:01 PM
meenakshi chaudhary  బ్యాక్ టూ బ్యాక్ మీనాక్షి జెండా పాతేసేలా
Meenakshi Chaudhary బ్యాక్ టూ బ్యాక్ మీనాక్షి జెండా పాతేసేలా
Advertisement
Ads by CJ

విజ‌యాలున్నా? టాలీవుడ్ లో అవ‌కాశాలు అందుకోలేక‌పోతున్న హీరోయిన్ ఎవ‌రు అంటే మీనాక్షి చౌద‌రి పేరే వినిపిస్తుంది. వంద‌ల కోట్ల వ‌సూళ్ల చిత్రాల్లో భాగ‌మైనా.. ప్ర‌తిభ‌వంతురాలైనా అవకాశాలు అందుకోవ‌డంలో మాత్రం డెడ్ స్లోగానే క‌నిపి స్తోంది. ఈ విష‌యంలో అమ్మ‌డికి అదృష్టం  ఎంత మాత్రం కలిసి రావ‌డం లేదు. అయితే టాలీవుడ్ లో క‌లిసి రాక‌పోయినా బాలీవుడ్ లో మాత్రం ఇప్పుడా క్రేజ్ క‌లిసొస్తుంది.

అమ్మ‌డి కెరీర్ తొలుత బాలీవుడ్ లో `అప్ స్టేర్స్` అనే చిత్రంతో లాంచ్ అయింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ మ‌రో హిందీ సినిమా చేయ‌లేదు. తెలుగు అవ‌కాశాలు రావ‌డంతో ఇక్క‌డే బిజీ అయింది. స‌రిగ్గా ఆరేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ అమ్మ‌డు బాలీవుడ్ లో రీలాంచ్ అవుతోంది. ఈసారి రీలాంచ్ ఆషామాషీగా జ‌ర‌గ‌లేదు. బ్యాక్ టూ బ్యాక్ బ‌డా ప్రాజెక్ట్ ల‌నే అమ్మ‌డు లైన్ లో పెట్టింది. ఇప్ప‌టికే `ఫోర్స్ 3` చిత్రంలో జాన్ అబ్ర‌హంకి జోడీగా ఎంపిక చేసిన‌ట్లు వినిపిస్తోంది.

తాజాగా  అక్షయ్ కుమార్‌తో భారీ ప్రాజెక్ట్ `భాగమ్ భాగ్ 2` లో కూడా మీనాక్షిని తీసుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.  ప్రియదర్శన్ దర్శకత్వంలో వచ్చిన కల్ట్ కామెడీ క్లాసిక్ `భాగమ్ భాగ్` సీక్వెల్ కావ‌డంతో ఈ ప్రాజెక్ట్ పై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. రాజ్‌ శాండిల్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్ర‌మిది. అక్షయ్ కుమార్ సరసన నటించే అవకాశం రావడం మీనాక్షి హిందీ కెరీర్‌కు పెద్ద బూస్ట్ అని చెప్పవచ్చు.

అలాగే  బాలీవుడ్‌లో కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు మడాక్ ఫిల్మ్స్. ఈ బ్యానర్‌లో కూడా  మీనాక్షి ఒక ఫీమేల్ సెంట్రిక్ లేదా ఓ సరికొత్త యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌లో నటించబోతున్నట్లు సమాచారం. ప్ర‌స్తుతం టాలీవుడ్ లో నాగ‌చైత‌న్య హీరోగా న‌టిస్తోన్న `వృష‌క‌ర్మ‌`లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

Meenakshi Chaudhary:

Actreess Meenakshi Chaudhary

Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ