సక్సెస్ ఫుల్ డైరెక్టర్, హిట్ మిషన్ అనిల్ రావిపూడి తదుపరి టార్గెట్ వెంకటేష్-నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ల కలయికలో క్రేజీ ఎంటర్టైనర్ అంటూ రీసెంట్ గానే అనౌన్స్ చేసారు. వెంకీ కి తోడుగా ఫహాద్ ఫాసిల్ లేదా తమిళ హీరో కార్తీ అనుకున్న ఫైనల్ గా కళ్యాణ్ రామ్ వచ్చి చేసారు. వెంకీ-వరుణ్ తేజ్ ఎఫ్ 2, ఎఫ్ 3 లో తోడల్లుళ్లుగా కనిపించారు.
మన శంకర వర ప్రసాద్ గారు లో చిరు-వెంకీ ఫ్రెండ్స్ గా కనిపించారు. మరి ఇప్పుడు వెంకటేష్, కళ్యాణ్ రామ్ లు ఎలా కనిపించబోతున్నారు. అన్నదమ్ములుగా, లేదా బావ-బావమరుదు లుగా అనే విషయంలో చాలా క్యూరియాసిటీ నడుస్తుంది. అయితే ఈ చిత్రం స్క్రిప్ట్ వర్క్ ఇంకా జరుగుతుంది అని తెలిపిన అనిల్ రావిపూడి ఈ సినిమా ఎలా ఉండబోతుందో అనేది కూడా క్లూ ఇచ్చేసారు.
వెంకీ-కళ్యాణ్ రామ్ కలయికలో రాబోయే చిత్రంలో యాక్షన్ ఉంటుంది.. ప్రేక్షకులకు నానుండి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ కూడా ఈ చిత్రంలో ఉంటుంది.. వచ్చే సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు మంచి ప్యాకేజ్ తో రాబోతున్నాం.. అంటూ దర్శకుడు అనిల్ రావిపూడి వెంకీ-కళ్యాణ్ రామ్ చిత్రం పై అంచనాలు పెంచేశారు.




ఈ వారం ఓటీటీ రిలీజులు 
Loading..