ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో ఎక్కువ శాతం హిట్ అయ్యాయి. కంటెంట్ ఎలా ఉన్నా ఫ్యామిలీ ఆడియన్స్ సంక్రాంతి సీజన్ లో విడుదలైన సినిమాలను ఆదరించారు. అందుకే వచ్చే ఏడు సంక్రాంతికి చాలామంది కుర్ర, సీనియర్ హీరోలు ఇప్పటినుంచే కచ్చిఫ్ లు వేశారు.
కాకపోతే ఈసారి సంక్రాంతి ఫెస్టివల్ ని తమ టైటిల్ లో ఉండేలా చాలామంది హీరోలు చూసుకోవడం గమనార్హం. సెంటిమెంట్ తగిలిస్తే సరిపోతుందా.. కంటెంట్ ఉండాలి, కథ బలంగా కనెక్ట్ అవ్వాలి, హీరోయిజమూ ఎలివేట్ అవ్వాలి. ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉండాలి. మరి ఇందులో ఏది తక్కువైనా వర్కౌట్ అవ్వదు.
ఈ ఏడాది రాజసాబ్ తో దెబ్బతిన్న దర్శకుడు మారుతి వచ్చే ఏడాది సంక్రాంతికి హ్యాపీ పొంగల్ టైటిల్ తో రావాలని చూస్తున్నాడట. వరస ప్లాప్ లతో సతమతమవుతున్న హీరో నితిన్ కూడా సంక్రాంతికి శుభాకాంక్షలు టైటిల్ తో రావాలని డిసైడ్ అయ్యాడట. మరోపక్క సంక్రాంతికి రిలీజ్ డేట్ ఇచ్చిన ఓ కాంబినేషన్ తమ టైటిల్ ని పండగ బొమ్మ గా రిజిస్టర్ చేయించారని టాక్ మొదలైంది.
మరి సంక్రాంతి సినిమాలు సంక్రాంతి పండుగ టైటిల్స్ ని పెట్టుకుని వచ్చేస్తే ఆడియన్స్ ఆదరించరు. అందులో దమ్ము ఉంటేనే ప్రేక్షకులు థియేటర్స్ కి వస్తారు. వీరే కాదు ఇంకా చాలామంది హీరోల కన్ను 2027 సంక్రాంతి పైనే ఉంది.




నటి త్రిష పై విమర్శల వెల్లువ 

Loading..