Advertisementt

NTRNeel - అది పుకారు మాత్రమే

Thu 26th Feb 2026 03:59 PM
ntr  NTRNeel - అది పుకారు మాత్రమే
NTRneel movie update NTRNeel - అది పుకారు మాత్రమే
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కలయికలో పవర్ ఫుల్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న డ్రాగన్ చిత్రం షూటింగ్ జోర్డాన్ లో జరుగుతుంది. ప్రస్తుతం అక్కడ జోర్డాన్ లో ఎన్టీఆర్-మలయాళ స్టార్ హీరో తోవినో థామస్ పై కీలక యాక్షన్ సన్నివేశాలతో పాటుగా ఎన్టీఆర్-రుక్మిణి వసంత్ లపై ఓ రోమాంటిక్ సాంగ్ ని నీల్ చిత్రీకరించనున్నారు.

అయితే సడన్ గా డ్రాగన్ చిత్రంలో ఓ క్రేజీ హీరో కనిపిస్తాడనే టాక్ వైరల్ అయ్యింది. అదే అక్కినేని ప్రిన్స్ అఖిల్ ఎన్టీఆర్-నీల్ మూవీలో కీ రోల్ లో కనిపించబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దానితో అక్కినేని ఫ్యాన్స్ అఖిల్ విషయంలో ఎక్కువగా ఊహించుకుంటున్నారు.

అయితే అఖిల్ అక్కినేని ఎన్టీఆర్-నీల్ మూవీలో నటిస్తున్నాడు అనే న్యూస్ జస్ట్ రూమర్ అని, అది పుకారు మాత్రమే అని డ్రాగన్ యూనిట్ కొట్టిపారేస్తుంది. మరి అఖిల్ అక్కినేని డ్రాగన్ లో కనిపిస్తాడనేది ఒట్టి పుకారు మాత్రమే అని తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలారోజులుగా ఎన్టీఆర్ డ్రాగన్ లుక్ కోసం తెగ ఎదురు చూస్తున్నారు. 

NTRneel movie update:

NTRneel movie 

Tags:   NTR
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ