Advertisementt

పెద్ది పై ఈ రూమర్స్ ఏల

Wed 25th Feb 2026 09:36 PM
peddi  పెద్ది పై ఈ రూమర్స్ ఏల
Peddi Postponed rumours పెద్ది పై ఈ రూమర్స్ ఏల
Advertisement
Ads by CJ

ఏప్రిల్ 30 న పెద్ది రాక పై పలు అనుమానాలు సోషల్ మీడియాలో మొదలయ్యాయి. ఒక్కొక్కరు ఒక్కో ట్వీట్. పెద్ది ఏప్రిల్ 30 కి వస్తుందా, అసలు ఇంకా షూటింగ్ పూర్తికాని సినిమా అనుకున్న టార్గెట్ రీచ్ అవుతుందా.. పెద్ది ఏప్రిల్ 30 నుంచి పోస్ట్ పోన్ అయ్యి మే లేదా జూన్ లో రిలీజ్ అనే క్లారిటీ రావాల్సి ఉంది అంటూ కొంతమంది తెగ ట్వీట్లు వేస్తున్నారు.

మరోపక్క దర్శకుడు బుచ్చి బాబు-రామ్ చరణ్ త్వరగా పెద్ది షూటింగ్ పూర్తి చెయ్యడమే కాదు, అందుకు వారు రాత్రి, పగలు కష్టపడుతున్నారు. హెక్టిక్ షెడ్యూల్స్ మధ్య పెద్ది షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్‌ను టార్గెట్‌గా పెట్టుకుని #Peddi టీమ్ నిరంతరం హార్డ్ వర్క్ చేస్తోంది.

ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్ది ని మేకర్స్ వాయిదా వేసే ప్రసక్తే లేదు. సోషల్ మీడియా లో వినిపిస్తున్న పోస్ట్‌పోన్ వార్తల్లో ఎలాంటి నిజం లేదు, అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే అంటూ మరికొందరు పెద్ది పై ట్వీట్లు వేస్తున్నారు. మరి ఇంత గందరగోళంలో మెగా ఫ్యాన్స్ పెద్ది విషయంలో నలిగిపోతుంటే.. 

ఈమద్యలో పెద్ది ఎప్పుడు రిలీజ్ అయినా కలెక్షన్స్ సునామీ ఖాయం.. అలా ఉంది ఔట్ పుట్ అంటూ కనిపిస్తున్న ట్వీట్లు చూసి మెగా ఫ్యాన్స్ కొద్దిగలో కొద్దిగ రిలాక్స్ అవుతున్నారు. 

Peddi Postponed rumours:

Peddi release date rumours

Tags:   PEDDI
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ