Advertisementt

రెండు సాంప్రదాయాల్లో రష్మిక-VD పెళ్లి

Tue 24th Feb 2026 06:45 PM
rashmika  రెండు సాంప్రదాయాల్లో రష్మిక-VD పెళ్లి
Vijay Deverakonda and Rashmika రెండు సాంప్రదాయాల్లో రష్మిక-VD పెళ్లి
Advertisement
Ads by CJ

క్రేజీ హీరో-హీరోయిన్స్ విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న లు సీక్రేట్ డేటింగ్, సీక్రెట్ ఎంగేజ్మెంట్ తర్వాత ఫిబ్రవరి 26 న పెళ్లి చేసుకోబోతున్నట్టుగా రీసెంట్ గానే అనౌన్స్ చేసారు. రాజస్తాన్ ఉదయపూర్ ప్యాలెస్ లో విజయ్ దేవరకొండ-రష్మికల పెళ్లి ఏర్పాట్లు ఆల్మోస్ట్ పూర్తయ్యాయి. ఈరోజు సంగీత్ తో వీరి వివాహ వేడుకలు ప్రారంభం కాబోతున్నాయి.

రేపు బుధవారం హల్దీ, పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఫంక్షన్స్, అలాగే 26 గురువారం వీరి వివాహం కోసం ఇప్పటికే అతిధులు ఉదయపూర్ పయనమయ్యారు. ఇటు కుటుంబ సభ్యులతో పాటుగా, కొద్దిమంది సన్నిహితులు, స్నేహితులు మొత్తగా ఓ 100 మంది ఈ పెళ్లి వేడుకల్లో పాల్గొనబోతున్నాఉ.

అయితే విజయ్ దేవరకొండ-రష్మికలు రెండు సాంప్రదాయాల్లో వివాహం చేసుకొంటున్నారట. విజయ్ దేవరకొండ తెలుగు వాడు, రష్మిక కన్నడ భామ. విజయ్ దేవరకొండ-రష్మిక లు తమ పెళ్లిని తెలుగు సంప్రదాయాన్ని, ఇటు కొడవ (కూర్గ్) పద్ధతులను మేళవించబోతుండటం విశేషం. 

ఫిబ్రవరి 26 రోజే వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఉదయం తెలుగు సంప్రదాయ పద్ధతిలో పెళ్లి జరగనుండగా, సాయంత్రం రష్మిక సొంత ఊరి పద్ధతి అయిన కొడవ స్టైల్లో వివాహ వేడుక జరగనుంది అని తెలుస్తుంది. 

Vijay Deverakonda and Rashmika :

Vijay Deverakonda and Rashmika have officially confirmed their February wedding

Tags:   RASHMIKA
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ