సంక్రాంతి రిలీజ్ లు అన్ని ఇప్పటికే ఓటీటీ లో సందడి చేసాయి. ప్రభాస్ రాజాసాబ్, మెగాస్టార్ చిరు మన శంకర వరప్రసాద్ గారు, నవీన్ పోలిశెట్టి అనగనగ ఒకరాజు, శర్వానంద్ నారి నారి నడుమ మురారి ఈ నాలుగు చిత్రాలు థియేటర్స్ నుంచి నాలుగు వారాలకే ఓటీటీ కి వచ్చేసాయి.
అదే సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ తెచ్చుకున్న మాస్ మహారాజ్ రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రం మాత్రం ఇప్పటివరకు ఓటీటీ కి రాలేదు. అసలు రవితేజ సినిమా ఎందుకు ఓటీటీ కి ఇంత ఆలస్యమైంది అంటూ ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు.
అయితే భర్త మహాశయులకు విజ్ఞప్తి ఓటీటీ హక్కులు దక్కించుకున్న జీ 5 ఈ చిత్రాన్ని ఇంకా ఓటీటీ కి ఇవ్వకపోవడానికి కారణం.. ఇతర భాషల డబ్బింగ్ పనులేనని తెలుస్తోంది. జీ5 సంస్థ ఈ సినిమాను కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, మరియు హిందీ భాషల్లో కూడా ఒకేసారి విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది.
అందుకే భర్త మహాశయులకు విజ్ఞప్తి ఓటీటీ రిలీజ్ లేట్ అవుతోంది అని తెలుస్తుంది. త్వరలోనే ఈ చిత్రం ఓటీటీ లోకి వస్తుంది అని సమాచారం.




ప్రభాస్ క్రేజ్ కి ఇదే నిదర్శనం 

Loading..