కొణిదెల నిహారిక నటన నుంచి నిర్మాతగా టర్న్ అయ్యింది. ప్రస్తుతం నిహారిక కొణిదెల బ్యానర్ నుంచి ఓ సినిమా రాబోతుంది. ఆ సినిమా ప్రమోషన్స్ లో యాక్టీవ్ గా కనిపిస్తూనే నిహారిక జీ తెలుగులో వస్తున్న ఆట 2 డాన్స్ షో కి జెడ్జి గా వుంది. ఈ షో కి నిహారిక చాలా గ్లామర్ గా వెళుతుంది.
ఈ వారం ఎపిసోడ్ లో నిహారిక జిగేల్ మనిపిస్తూ చేయించిన ఫొటోస్ షూట్ వైరల్ అవుతోంది. రింగు రింగుల హెయిర్ కట్ తో నిహారిక కొత్త లుక్ చాలా డిఫరెంట్ గా కనిపించింది. రంగురంగుల మోడ్రెన్ వేర్ లో నిహారిక నిజంగా వావ్ అనిపించింది.
ఆట 2 డాన్స్ షో లో నిహారిక జెడ్జి గా యాంకర్ సుధీర్ తో కామెడీ చేస్తూ జానీ మాస్టర్ తో కలిసి జెడ్జిమెంట్ ఇస్తుంది. సరదాగానే కాదు అంతకుమించిన డ్రెస్సింగ్ స్టయిల్ తో నిహారిక కొణిదెల ఈ ఆట 2 షో లో హైలెట్ అవుతుంది.




బన్నీ కోసం లోకేష్ చివరి అస్త్రం!

Loading..