Advertisementt

అనిల్ రావిపూడి పర్ఫెక్ట్ అండి

Sat 21st Feb 2026 11:21 AM
anil ravipudi  అనిల్ రావిపూడి పర్ఫెక్ట్ అండి
Director Anil Ravipudi అనిల్ రావిపూడి పర్ఫెక్ట్ అండి
Advertisement
Ads by CJ

అందరి దర్శకుల్లా భారీ బడ్జెట్ పెట్టించి సినిమాని హైఫై గా తెరకెక్కించిన బిజినెస్ విషయంలో టెన్షన్ పడి, ఫలితం తేడా వస్తుందో అని భయపడే రకం కాదు సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి. బడ్జెట్ తక్కువలోనే మెరుగైన క్వాలిటీ తో సినిమా చేస్తాడు, సినిమా విడుదలకు ముందే బిజినెస్ చేసుకుని కూల్ గా ప్రమోషన్స్ చేసి హిట్ కొట్టేస్తాడు.

కానీ కొంతమంది మితిమీరిన బడ్జెట్ పెట్టి బిజినెస్ అవ్వక టెన్షన్ పడి నామమాత్రపు ప్రమోషన్స్ తో ప్రేక్షకులముందుకు వచ్చి రిజల్ట్ తేడా కొడితే మొహం చాటేస్తారు. ఇక తాజాగా అనిల్ రావిపూడి వేరే భాషల హీరోలను తీసుకుని నెక్స్ట్ సంక్రాంతికి మల్టీస్టారర్ ప్లాన్ చేస్తుంటే వారేమో పారితోషికాలు భారీగా కోరుకుంటున్నారు.

మరి పారితోషికాలకే ఎక్కువైతే అప్పుడు బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ అవ్వాలి, అలా ఎందుకులే అని .. ముందు అనుకున్న హీరోలని అనిల్ రావిపూడి పక్కన పెట్టెయ్యడం చర్చనీయాంశం అయ్యింది. వచ్చే సంక్రాంతికి అనౌన్స్ చేసే సినిమాలో ఒక హీరోగా మలయాళ స్టార్ హీరో ఫహద్ అనుకున్నారు, ఆతర్వాత కార్తీ అనుకున్నారు.

కానీ వారిరువురు భారీ పారితోషికాలు డిమాండ్ చెయ్యడంతో అనిల్ రావిపూడి కామ్ అయ్యారట. మరి ఆ ప్లేస్ లోకి ఏ క్రేజీ హీరోని తీసుకుంటారో తెలియదు కానీ.. రెమ్యునరేషన్స్ ఎక్కువ కాకుండా అనిల్ రావిపూడి ఆలోచన చెయ్యడం మాత్రం సూపర్ అంటూ చాలామంది కామెంట్లు పెడుతున్నారు. 

Director Anil Ravipudi:

Anil Ravipudi

Tags:   ANIL RAVIPUDI
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ