Advertisementt

ప్రత్యూష కేసులో సంచలన తీర్పు

Tue 17th Feb 2026 12:09 PM
pratyusha  ప్రత్యూష కేసులో సంచలన తీర్పు
Sensational Verdict in Actress Pratyusha case ప్రత్యూష కేసులో సంచలన తీర్పు
Advertisement
Ads by CJ

2002 ఆత్మహత్య చేసుకున్న నటి ప్రత్యూష కేసు అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. ఇంటర్లోనే సిద్దార్థ్ తో ప్రేమలో పడిన ప్రత్యూష కి ఇంటర్ తర్వాత వెండితెర ఆఫర్స్ రాగా.. సిద్దార్థ్ డిగ్రీ లో జాయిన్ అయ్యాడు, ఆతర్వాత ఏమైందో ఏమో ఇద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా వారిరువురిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా ప్రత్యూష మృత్యువుతో పోరాడి ఓడింది, సిద్దార్థ్ రెడ్డి ప్రాణాలతో బ్రతికి బయటపడ్డాడు.

కానీ అతనిపై ఆత్మహత్యకు ప్రయతించడం, అలాగే ప్రత్యుషను ఆత్మహత్యకు పురిగొల్పాడు అంటూ కేసులు నమోదు అయ్యాయి. దానితో సిద్ధార్థరెడ్డికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఐదేళ్ల కఠిన కారాగారశిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. ఈ తీర్పు పై సిద్ధార్థరెడ్డి హైకోర్టును ఆశ్రయించగా, హై కోర్టు జైలుశిక్షను రెండేళ్లకు తగిస్తూ.. జరిమానాను రూ.50 వేలకు పెంచుతూ తీర్పు ఇచ్చారు.

హై కోర్టు తీర్పు ని సవాలు చేస్తూ సిద్దార్థ్ రెడ్డి తల్లి సుప్రీం కోర్టు ని ఆశ్రయించగా.. ఆమె వేసిన పిటిషన్ ని సుప్రీం కోర్టు కొట్టివేస్తూ.. హై కోర్టు తీర్పుని సమర్ధించడమే కాదు సిద్దార్థరెడ్డి కి బిగ్ షాక్ ఇచ్చింది. హై కోర్టు విచించిన శిక్షను వెంటనే అమలు చెయ్యాలని, సిద్ధార్థరెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది.

Sensational Verdict in Actress Pratyusha case:

Supreme Court Sensational Verdict in Actress Pratyusha case

Tags:   PRATYUSHA
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ