సంగీత దిగ్గజం రెహమాన్ తెలుగు సినిమాలకు సంగీతం అందించింది చాలా తక్కువ. ఆయన మ్యూజిక్ కంపోజ్ చేసిన తెలుగు సినిమాలు వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. బాలకృష్ణ నటించిన `నిప్పురవ్వ` తో టాలీవుడ్ లాంచ్ అయ్యారు. అనంతరం, విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన `సూపర్ పోలీస్` కు సంగీతం అందించారు. ఇది 1994లో రిలీజ్ అయిన చిత్రం. అదే ఏడాది రాజశేఖర్ నటించిన `గ్యాంగ్ మాస్టర్`కు బాణీలు సమకూర్చారు.
అనంతరం లాంగ్య్ తీసుకుని సూపర్ స్టార్ మహేష్ నటించిన `నాని` సినిమాకు మళ్లీ సంగీతం అందించారు. మ్యూజికల్ గా ఆసినిమా మంచి విజయం సాధించింది. అనంతరం ఆరేళ్లకు మళ్లీ పవన్ కళ్యాన్ హీరోగా నటించిన `కొమరం పులి`కి కంపోజ్ చేసారు. అలాగే యువ సామ్రాట్ నాగచైతన్య నటించిన `సాహసం శ్వాసగా సాగిపో` చిత్రానికి రెహమాన్ స్వరకర్తగా వ్యవహరించారు.
తెలుగులో ఇదే చివరి సినిమా. మళ్లీ దశాబ్ద కాలానికి టాలీవుడ్ వైపు చూసారు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తోన్న `పెద్ది` సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిని చికిరి చిరికి సాంగ్ తో రెహమాన్ ఈజ్ బ్యాక్ అనిపించారు. ఈనేపథ్యంలో రెహమాన్ మరిన్ని తెలుగు సినిమాలకు పని చేసేలా రంగం సిద్దం చేస్తున్నారు.
చిరంజీవి-బాబి సినిమాకు రెహమాన్ పేరు పరిశీలనలో ఉంది. అలాగే విజయ్ దేరకొండ హీరోగా విక్రమ్. కె. కుమార్ ఓ సినిమాకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి రెహమాన్ ని తీసుకోవాలని ప్లాన్ చస్తున్నారు. అలాగే చరణ్-సుకుమార్ కాంబినేషన్ లో రూపొందనున్న సినిమాకు రెహమాన్ ని రిపీట్ చేయాలని సుక్కు భావిస్తున్నాడు. చూస్తుంటే? ఇంతకాలం భారీ గ్యాప్ వచ్చినా? ఇప్పుడా గ్యాప్ మొత్తాన్ని ఒకేసారి ఫిల్ చేసేలా రెహమాన్ మూవ్ మెంట్ కనిపిస్తోంది.




కమెడియన్‌కి ఎట్టకేలకు బెయిల్

Loading..