యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన `అదుర్స్` అప్పట్లో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. తారక్ లో మరో కొత్త నటుడ్ని తట్టిలేపిన చిత్రమిది. తారక్ రోల్ ఆద్యంతం హిలేరియస్ ఎంటర్ టైనర్ గా ఆకట్టుకుంటుంది. తారక్ లాంటి మాస్ అప్పిరియన్స్ ఉన్న నటుడితో వినాయక్ అలాంటి పాత్ర కి ఒప్పించడం అతడి గొప్పతనమే.
అయితే ఈ సినిమాకు సీక్వెల్ గా `అదుర్స్ 2` చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నారు. తారక్-వినాయక్ కూడా చాలా సందర్భాల్లో మాట్లాడారు. కానీ ఇంత వరకూ సాధ్యపడలేదు. `అదుర్స్` కు స్టోరీ అందించింది రైటర్ కోన వెంకట్. తాజాగా ఆయన `అదుర్స్ 2` కథ రెడీ అవుతుందని తెలిపారు. అరగంట కథ సిద్దమైందని వెల్లడించారు.
తారక్ మరో రెండు సినిమాలు పూర్తి చేసే లోపు మొత్తం కథ సిద్దమవుతుందని తెలిపారు. ఇంత వరకూ బాగానే ఉంది. కానీ తారక్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. పాన్ ఇండియా కథల్లోనే నటిస్తున్నాడు. అప్ కమింగ్ చిత్రాల కథలన్నీ అలాగే ఉన్నాయి. దర్శకులు పాన్ ఇండియాలో సక్సెస్ అయిన వారే.
`అదుర్స్ 2` అన్నది రీజనల్ మార్కెట్ సినిమా మాత్రమే. పాన్ ఇండియాకు కనెక్ట్ అయ్యే అవకాశాలు లేవు. మరి ఇలాంటి పరిస్థితుల్లో తారక్ రిస్క్ తీసుకుంటాడా? అన్న సందేహం వ్యక్తమవుతుంది. ఒకవేళ తీసుకుంటే? గనుక ప్రభాస్ లా విమర్శలు ఎదుర్కోవాల్సిందేనా? అన్న చర్చ మొదలైంది. `ది రాజాసాబ్` తో ప్రభాస్ ఎలాంటి ఫలితాలు చూసాడో తెలిసిందే.




అనుపమ అందం అజంతా శిల్పం 

Loading..