ఈరోజు ఫిబ్రవరి 15. మహాశివరాత్రి. అదే రోజు దర్శకుడు బుచ్చిబాబు పుట్టిన రోజు. ఉప్పెన చిత్రంతో దర్శకుడిగా తన మార్క్ చూపించి రెండో సినిమానే పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ తో పెద్ది అంటూ అంచనాలు పెంచేసిన ఈ దర్శకుడి ఈ బర్త్ డే ని ఈరోజు పెద్ది సెట్ లో గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసారు.
పెద్ది ఫస్ట్ షాట్ తో సినిమాపై ఆకాశమంత అంచనాలు క్రియేట్ చేసిన బుచ్చిబాబు.. ఏ.ఆర్ రెహమాన్ మ్యూజిక్ తో ఫస్ట్ సింగిల్ చికిరి.. చికిరి సాంగ్ తో సెన్సేషన్ క్రియేట్ చేసారు. ఇక ఈరోజు బుచ్చి బర్త్ డే కి పెద్ది వర్కింగ్ వీడియో రిలీజ్ చెయ్యగా.. బుచ్చిబాబు ఎంతగా తన క్రియేటివిటీ చూపిస్తున్నాడో అనేది స్పష్టమవుతుంది.
అంతేకాదు ఆ వీడియో చివరిలో బుచ్చిబాబు చెప్పిన డైలాగ్ వింటే థియేటర్స్ తగలబడిపోవాలె అంటూ మెగా ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఎగస్ పార్టీ వాడికి దూల తీర్చి ధూపం వేయాలంటే ఈ మాత్రం మంట పెట్టాలి లేరా 🔥 🔥 🔥 అంటూ బుచ్చి బాబు చెబుతున్న పవర్ ఫుల్ డైలాగ్ పెద్ది లో థియేటర్స్ లో ఇంపాక్ట్ క్రియేట్ చెయ్యడం పక్కా.




చిరు-సురేఖకు అల్లు వారి మొదటి ఆహ్వానం 

Loading..