కన్నడ రాకింగ్ స్టార్ యష్ క్రేజ్ బాక్సాఫీస్ వద్దే కాదు, సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ పైనా ఏ స్థాయిలో ఉందో తాజా ఐఎండిబి నివేదిక మరోసారి నిరూపించింది. యష్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం `టాక్సిక్`, బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ సినిమాను వెనక్కి నెట్టి మోస్ట్ అవైటెడ్ 2026 చిత్రాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.
IMDb రియల్-టైమ్ పాపులారిటీ ట్రాకర్ అందించిన వివరాల ప్రకారం.. ప్రేక్షకులలో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న సినిమాల్లో `టాక్సిక్` 32.4 శాతం షేర్ తో మొదటి స్థానంలో నిలిచింది. రణ్‌వీర్ సింగ్ నటించిన `ధురంధర్ 2: ది రివెంజ్` కేవలం 19.9 శాతం షేర్‌తో రెండో స్థానంలో ఉంది. యష్ సినిమా తన సమీప ప్రత్యర్థి కంటే సుమారు 32.4 శాతం పైగా ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ ఐఎండిబి పేజీ వ్యూస్, యూజర్ యాక్టివిటీలో రికార్డులు సృష్టిస్తోంది.
కేజీఎఫ్ సిరీస్ తర్వాత యష్ చేస్తున్న సినిమా కావడంతో టాక్సిక్ పై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమాలో యష్ రాక్ సాలిడ్ లుక్ చాలా డిఫరెంట్ గా, `రా అండ్ రస్టిక్`గా ఉంటుందని ఇప్పటికే విడుదలైన పోస్టర్లు టీజర్ వెల్లడించాయి. అవార్డు విన్నింగ్ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ఈ యాక్షన్ డ్రామాను తెరకెక్కిస్తుండటంతో కథ పరంగా కూడా ఇది చాలా బలంగా ఉంటుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఈ సినిమాను ఒక గ్లోబల్ గ్యాంగ్‌స్టర్ డ్రామా కథతో రూపొందిస్తున్నారు. ఇందులో హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా పని చేస్తుండటం సినిమాకు హైప్ పెంచింది.
బాలీవుడ్ క్రేజీ స్టార్ రణ్‌వీర్ సింగ్ నటించిన `ధురంధర్ 2`పై భారీ అంచనాలు ఉన్నా కానీ, యష్‌కి ఉన్న మాస్ ఫాలోయింగ్ ముందు ఆ సినిమా వెనుకబడిపోయింది. ముఖ్యంగా సౌత్ సినిమాలపై ఉత్తరాది ప్రేక్షకులు కూడా విపరీతమైన ఆసక్తి చూపిస్తుండటమే ఇందుకు ప్రధాన కారణం. ఈ చిత్రంలో యష్ డ్రగ్ లార్డ్ గా నటిస్తున్నాడు.





హిట్ అయినా సౌండ్ లేదు 
Loading..