పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్పిరిట్ షూట్ లో ఉన్నారా, లేదంటే హను రాఘవపూడి తో కలిసి ఫౌజీ షూట్ లో ఉన్నారా అనే విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ లో చాలా క్యూరియాసిటీ ఉంది. ప్రభాస్ ప్రస్తుతం అటు ఫౌజీ ఇటు స్పిరిట్ షూటింగ్స్ లో పారలల్ గా పాల్గొంటున్నారు. తాజాగా ఫౌజీ షూటింగ్ చౌటుప్పల్ దగ్గర దండుమైలారం కొండ పై జరుగుతుంది.
ఈ షెడ్యూల్ లో హార్స్ రైడింగ్ మరియు ఛేజింగ్ సీన్స్ తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. సినిమాలో ఈ సీన్స్ మేజర్ సీక్వెన్స్ గా నిలుస్తాయని చెబుతున్నారు. ఈ చిత్రంలో ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుంది. 1940ల నాటి నేపథ్యంలో సాగే ఈ సినిమా సుమారు 60% చిత్రీకరణ పూర్తి చేసుకుంది.
దసరా టార్గెట్ గా ఫౌజీ తెరకెక్కుతుంది. హను రాఘవపూడి ఈసారి రిలీజ్ డేట్ మిస్ అవ్వకుండా చూడాలని షూటింగ్ త్వరగా ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. మరోపక్క సందీప్ రెడ్డి వంగ కూడా స్పిరిట్ షూటింగ్ ని ప్రభాస్ డేట్స్ ని బట్టి ప్లాన్ చేసుకుంటున్నారు.





రిలీజ్ డేట్ దాచేసిన లెనిన్
Loading..