విశ్వక్ సేన్ ఖాతాలో మరో ప్లాప్. లైలా షాక్ నుంచి ఫంకీ తో కోలుకోవాలని చూసిన విశ్వక్ సేన్ కి ఫంకీ కూడా పెద్ద షాకిచ్చింది. కనీసం గౌరవప్రదమైన 2 రేటింగ్ కూడా రివ్యూయర్స్ ఇవ్వలేదు అంటే ఫంకీ ఎలా ఉందో అర్ధమైపోతుంది. ఫంకీ సినిమా చూసిన వాళ్ళు అనుదీప్ నుంచి దీన్ని ఎక్స్పెక్ట్ చెయ్యలేదు అంటున్నారు.
నిర్మాత నాగవంశీ కూడా అదే చెబుతున్నారు. ఫంకీ ప్రెస్ మీట్ పెట్టి మరీ నాగవంశీ తన సినిమా బాలేదు అని చెప్పడం విడ్డురమే. నా సినిమా బావుంటుంది అని నేను మీకు చెప్పలేదు, అతుకులు బొతుకులు అంటూ రివ్యూస్ లో రాసారు, అది నేను ముందే చెప్పాను కదా, ఎడిటింగ్ బాలేదు అన్నారు. సినిమానే బ్లాక్స్ గా ఉంటె మీరు చెప్పేదేమిటి, మీరిచ్చే రివ్యూస్ కోసం నేను సినిమా తియ్యలేదు.
రిలీజ్ కి ముందే ఫంకీ గురించి చెప్పాను, కానీ రివ్యూస్ లో మీరే ఏదో కనిపెట్టినట్టుగా రాస్తున్నారు అంటూ తను తెరకెక్కించిన ఫంకీ చిత్రాన్ని నాగవంశీ తనకి తానే తిడుతూ పనిలో పనిగా రివ్యూ రైటర్స్ ని ఏసుకున్నారు. మరి సినిమాని తిట్టుకుంటూ అక్కడ దర్శకుడు అనుదీప్, హీరో విశ్వక్ సేన్ ల గురించి నాగవంశీ ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేసినట్లుగా ఉంది.





సూపర్ స్టార్ కి దిమ్మతిరిగే రెమ్యునరేషన్ 
Loading..