కింగ్ నాగార్జున తన 100 వ సినిమాని తమిళ డైరెక్టర్ కార్తీక్ తో చేస్తున్నారు. రీసెంట్ గానే స్టార్ట్ అయిన ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. అది ఇంకా షూటింగ్ ప్రోగ్రెస్ లోనే ఉన్న సమయంలో సడన్ గా సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి సీక్వెల్ ప్రకటిస్తూ వాసివాడి తస్సాదియ్యా సంక్రాంతికి వస్తున్నాం అంటూ జనవరి 15 న రిలీజ్ డేట్ లాక్ చేసారు.
అయితే నాగార్జున-కళ్యాణ్ కృష్ణ కలయికలో సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కబోతున్న చిత్రంలో నాగ చైతన్య అలాగే అఖిల్ కూడా కనిపిస్తారనే ప్రచారం ఉండగా.. ఈ చిత్రానికి వాసివాడి తస్సాదియ్యా టైటిల్ అనుకున్నప్పటికి తాజాగా నాగార్జున 101 ప్రాజెక్ట్ కి సంక్రాంతి సోగ్గాళ్ళు అనే టైటిల్ పెడుతున్నట్లుగా తెలుస్తుంది.
మరి నాగార్జున తో కలిసి ఇద్దరి కొడుకులు సంక్రాంతి సోగ్గాళ్ళుగా కనిపిస్తే అక్కినేని ఫ్యాన్స్ కే కాదు కామన్ ఆడియన్స్ కి కూడా పండగే. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ముందుగా కచ్చిఫ్ వేసిన నాగ్ సంక్రాంతి సోగ్గాళ్ళు తో ఇరగ్గొటేయడం ఖాయం.





స్టార్ హీరోని చంపేస్తామని బెదిరింపులు
Loading..