Advertisementt

సీనియ‌ర్లు అంతా 2027 సంక్రాంతికే!

Mon 09th Feb 2026 09:07 PM
tollywood  సీనియ‌ర్లు అంతా 2027 సంక్రాంతికే!
Seniors Heating Up Sankranti సీనియ‌ర్లు అంతా 2027 సంక్రాంతికే!
Advertisement
Ads by CJ

పాత రోజుల్లో చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున‌, వెంక‌టేష్ చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద పోటాపోటీగా  రిలీజ్ అయ్యేవి. పోటీ విష‌యంలో ఏ హీరో వెన‌క్కి త‌గ్గే వారు కాదు.  వెన‌క్కి త‌గ్గ‌డాన్ని నామోషీగా భావించి న‌ష్టాలొచ్చినా ప‌ర్వాలేద‌ని  రిలీజ్ ను ప్రెస్టిజీయ‌స్ గా తీసుకునేవారు. ప్ర‌త్యేకించి సంక్రాంతి స‌హా పండ‌గ సీజ‌న‌ల్ల‌లో ఈ పోటీ ప్ర‌ముఖంగా క‌నిపించేది. అయితే కాల‌క్ర‌మంలో ఎన్నో మార్పులొచ్చాయి.

పోటీ కంటే?  తెలివిగా జ‌నాల జేబుల్లో నుంచి డ‌బ్బులు ఎలా రాబ‌ట్టాలి? అనే దిశ‌గా అడుగులు వేసి రిలీజ్ లు ప్లాన్ చేసుకుంటున్నారు. పోటీ లేకుండా రిలీజ్ లు చేసి న‌ష్టాల నుంచి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయితే 2027 సంక్రాంతి కి మాత్రం మ‌రోసారి ఆ న‌లుగురు హీరోలు పోటా పోటీగా రిలీజ్ కు వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

ఇప్ప‌టికే వెంకటేష్ హీరోగా అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో  ఓ చిత్రం లాక్ అయింది. ఈ చిత్రాన్ని  సంక్రాంతి కి రిలీజ్ చేస్తున్న‌ట్లు తేలిపోయింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబి ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న చిత్రం కూడా సంక్రాంతికే రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. వ‌చ్చే నెల‌లో ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌ల‌వుతుంది.

అలాగే న‌ట‌సింహ బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌కతంలో  ముంబై మాఫియా నేప‌థ్యంలో ఓ సినిమా తెర‌కెక్కుతుంది. ఈ చిత్రాన్ని కూడా పండ‌క్కే రిలీజ్ చేయాల‌నుకుంటున్నారు. ఇంకా కింగ్ నాగార్జున 101వ సినిమా క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో లాక్ అయినట్లు వార్త‌లొస్తున్నాయి. సంక్రాంతి సీజ‌న్ అంటే నాగ్ సినిమా త‌ప్ప‌నిస‌రి. ఈ సీజ‌న్ అత‌డికి సెంటిమెంట్. కాబ‌ట్టి  వీళ్లిద్ద‌రి కాంబినేష‌న్ లో మొద‌ల‌య్యే చిత్రం ప‌క్కా సంక్రాంతికే వ‌స్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

Seniors Heating Up Sankranti:

Tollywood Seniors to fight hit out during Sankranti

Tags:   TOLLYWOOD
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ