Advertisementt

మెగాస్టార్ తో మ‌ళ్లీ ఇద్ద‌రు భామ‌లా

Mon 09th Feb 2026 10:22 AM
mega 158  మెగాస్టార్ తో మ‌ళ్లీ ఇద్ద‌రు భామ‌లా
Mega 158 update మెగాస్టార్ తో మ‌ళ్లీ ఇద్ద‌రు భామ‌లా
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా బాబి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం లాక్ అయిన సంగ‌తి తెలిసిందే.  ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. ఆ ప‌నులు ముగించి త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు పెట్ట నున్నారు. ఇందులో హీరోయిన్ గా ప్రియ‌మ‌ణి న‌టిస్తున్నట్లు ఇప్ప‌టికే ప్ర‌చారంలో ఉంది. చిరంజీవి కుమార్తె పాత్ర‌లో సారా అర్జున్ న‌టిస్తున్న  వార్తలొస్తున్నాయి.

తొలుత ఈ పాత్ర కోసం కృతిశెట్టి ని  అనుకున్నా? ఆమె కంటే సారా అర్జున్ అయితే బాగుంటుంద‌ని బాబి అటువైపు ట‌ర్న్ అయిన‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌రో ఇంట్రెస్టింగ్ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇందులో మ‌రో హీరోయిన్ కి కూడా అవ‌కాశం ఉంద‌ని తెలిసింది. ఇప్ప‌టికే సీనియ‌ర్ గా ప్రియ‌మ‌ణి ఎంట్రీ ఇస్తోంది.

ఈ నేప‌థ్యంలో మ‌రో న‌టి అంటే? సీనియ‌ర్ కే ఛాన్స్ ఇస్తారా?  వ‌య‌సుతో సంబంధం లేకుండా తీసుకుంటారా? అన్న‌ది తెలియాలి. ఇది తండ్రి కూతుళ్ల సెంటిమెంట్ క‌థ‌గా తెలుస్తోంది. తండ్రి పాత్ర‌లో చిరంజీవి క‌నిపించ‌గా? ఆయ‌న‌కు భార్య పాత్ర‌లో ప్రియ‌మ‌ణి న‌టిస్తుందా? కొత్త‌గా తీసుకునే న‌టి ఆ పాత్ర‌లో భాగ‌మ‌వుతుందా? అన్న‌ది స‌స్పెన్స్  గా మారింది.  వెండి తెర‌పై ఇద్ద‌రు  హీరోయిన్ల‌తో చిరంజీవి ప‌నిచేసి చాలా కాల‌మ‌వుతోంది.

చిరు రొమాంటిక్ పాత్ర‌ల‌కు దూర‌మ‌వుతున్నారే అనుకున్న స‌మ‌యంలో? అనీల్ రావిపూడి `మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు`తో ఆ లోటు తీర్చేసారు. న‌య‌న‌తార‌-చిరంజీవి రొమాంటిక్ కామెడీ సన్నివేశాలు ప్రేక్ష‌కుల్ని అల‌రించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా బాబి త‌న సినిమా కోసం ఏకంగా ఇద్ద‌రు హీరోయిన్లు తీసుకుంటున్నాడంటే? రొమాంటిక్ ట‌చ్ ఇస్తాడేమో చూడాలి.

Mega 158 update:

Chiranjeevi-Bobby Mega 158

Tags:   MEGA 158
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ