కేవీఎన్ ప్రొడక్షన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. శాండిల్ వుడ్ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా కొనసాగుతోంది. నాలుగేళ్ల క్రితమే నిర్మాణ రంగంలోకి వచ్చినా స్టార్ హీరోలే టార్గెట్ గా సినిమాలు చేయడంతో సౌత్ లో అనతి కాలంలోనే పాపులర్ సంస్థగా మారింది. `సకాత్`, `బై టూ లవ్` లాంటి రెండు కన్నడ చిత్రాలు నిర్మించినా కోలీవుడ్ లో దళపతి విజయ్ తో `జన నాయగన్` నిర్మించే సరికి సౌత్ లో ఫేమస్ సంస్థగా మారిపోయింది.
ఈ సినిమా రిలీజ్ కు ఆటంకాలు ఏర్పడటంతో? నెట్టింట మరింత వైరల్ గా మారింది. అలాగే కన్నడ స్టార్ యశ్ తో పాన్ ఇండియాలో `టాక్సిక్` చిత్రాన్ని ఇదే సంస్థ నిర్మిస్తోంది. దీంతో పాటు కన్నడలో `ది డెవిల్` అనే మరో చిత్రాన్ని పట్టాలెక్కించింది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న 158వ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంటర్ అవుతోంది.
బాబి దర్శకత్వం వహిస్తోన్న చిత్రమిది. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా కేవీఎన్ సంస్థ నిర్మించడానికి ముందుకొచ్చింది. వాస్తవానికి ఈ ఛాన్స్ కోసం చాలా నిర్మాణ సంస్థలు పోటీ పడ్డాయి. కానీ వాళ్లందర్నీ దాటుకుని ఛాన్స్ కేవీఎన్ కి వరించింది. ఇలా ఇప్పటికే మూడు భాషల్ని సదరు సంస్థ చుట్టేసింది. ఈ నేపథ్యంలో తాజాగా కేవీఎన్ బాలీవుడ్ లో కూడా ఎంటర్ అవ్వడానికి రెడీ అవుతోంది.
సన్ని డియోల్ కథానాయకుడిగా నిఖిల్ నగేష్ భట్ ఓ చిత్రాన్ని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని ఓ ప్రముఖ బాలీవుడ్ సంస్థ నిర్మించనుంది. ఆ సంస్థ భాగస్వామ్యంలోనే కేవీఎన్ కూడా చేరాలనుకుంటోంది.
హిందీ పరిశ్రమలో కూడా అడుగు పెట్టాలని అన్న ఉద్దేశంతోనే కేవీఎన్ ఎంటర్ అవుతోంది. ప్రస్తుతం సన్ని డియోల్ వరుస విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.





మిల్కి బ్యూటీ మెరుపులు
Loading..