మిల్కి బ్యూటీ మెరుపులు
Tamanna Latest Look Viralమిల్కి బ్యూటీ తమన్నా ఎప్పుడు బిజీగా ఉండేందుకు తపన పడుతుంది. కెరీర్ లో బిజీగా ఉండాలంటే గ్లామర్ తప్ప వేరే మార్గం లేదు అని నమ్మే భామల్లో తమన్నా ముందు వరసలో ఉంటుంది. సౌత్ అవకాశాలు తగ్గుతున్నాయనగానే నార్త్ లో పాగా వేసిన తమన్నా అక్కడ వెబ్ సీరీస్ లు లేదంటే స్పెషల్ సాంగ్స్ అంటూ హడావిడి చేస్తుంది.
ఈమద్యమలో బిజినెస్ లోను సత్తా చాటుతుంది. తాజాగా ముంబైలో జ్యువెలరీ షాప్ ఓపెన్ చేసింది. ఇక సోషల్ మీడియాలో ట్రెండీ ఫొటోస్ వదులుతూ తానింకా ఫామ్ లో ఉన్నాను అని గుర్తు చేస్తూ ఉంటుంది. అంతేకాదు కొద్దిగా బబ్లీగా మారిన తమన్నా మళ్ళీ నాజూగ్గా మారిపోయింది.
గత ఏడాది లవ్ బ్రేకప్ తో కాస్త సతమతమై మళ్లీ పని పై దృష్టి సారించిన తమన్నా తాజాగా బ్లాక్ మోడ్రెన్ వేర్ లో ఉన్న ఫోటో షూట్ వదిలింది. ఆ డ్రెస్ లో మిల్కి బ్యూటీ మెరుపులు చూపించింది. పాల మీగడ లాంటి శరీరంతో అందంగా తమన్నా ఈ పిక్స్ లో మెరిసిపోయింది అంటే నమ్మాలి.
Tamanna News Look Viral






































