Advertisementt

పుండు మీద కారం చల్లడం అంటే ఇదే

Sun 08th Feb 2026 04:36 PM
raja saab  పుండు మీద కారం చల్లడం అంటే ఇదే
Raja Saab OTT talk పుండు మీద కారం చల్లడం అంటే ఇదే
Advertisement
Ads by CJ

జనవరి 9 న థియేటర్స్ లో విడుదలైన ప్రభాస్ రాజసాబ్ సినిమా ప్లాప్ అవడం ఒక ఎత్తు, సోషల్ మీడియాలో రాజసాబ్ ని ట్రోల్ చెయ్యడం మరో ఎత్తు. ప్రభాస్ ఫ్యాన్స్ రిలీజ్ అయ్యాక మారుతి కి సపోర్ట్ చేసినా.. చివరికి అంటే థియేట్రికల్ రన్ ముగిసేసరికి మారుతి కి యాంటీగా మారిపోయారు. ఆ దెబ్బకు మారుతి సైలెంట్ గా అజ్ఞాతంలోకి వెళ్ళాడు. 

సరే రాజసాబ్ గాయం మానుతుంది అనే లోపు పుండుమీద కారం చల్లినట్టుగా రాజసాబ్ ఓటీటీ వెర్షన్ పై సోషల్ మీడియా మీమ్స్ చూసాక మారుతి ని మళ్లీ మళ్లీ టార్గెట్ చెయ్యడం స్టార్ట్ చేసారు. అంత పెద్ద స్టార్ ని అలా జోకర్ ని చేసావేమిటి మారుతి, కథ తో అంత పెద్ద పాన్ ఇండియా ఫిలిం ఎలా తీద్దామనుకున్నావ్, అసలు ప్రభాస్ లుక్స్ ఏమిటి, ఆ క్లోజప్ షాట్స్ ఏమిటి.

హీరోయిన్స్ ఏమిటి, ఆ సాంగ్స్ ఏమిటి, ఆ విజువల్ ఎఫెక్ట్స్ ఏమిటి, ఆ రీమిక్స్ సాంగ్ ఎందుకు, ఆ కమేడియన్స్ తెలుగులోనే ఫామ్ లో లేరు, వారు పాన్ ఇండియా కి ఎలా కనెక్ట్ అవుతారు.. అంటూ మారుతి ని మరోమారు ఏసుకుంటున్నారు. మారుతి ఇప్పటివరకు ఏ సినిమా ప్లాప్ అయినా ఇలాంటి మానసిక క్షోభను అనుభవించి ఉండడు, కేవలం రాజసాబ్ సినిమా విషయంలో మాత్రమే మారుతి కి బయటికి రాలేని పరిస్థితి.

Raja Saab OTT talk:

The Raja Saab OTT public talk

Tags:   RAJA SAAB
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ