Advertisementt

రవితేజ ఒక్కడే బ్యాలెన్స్

Sun 08th Feb 2026 11:25 AM
ravi teja  రవితేజ ఒక్కడే బ్యాలెన్స్
Bhartha Mahasayulaku Wignyapthi OTT date balance రవితేజ ఒక్కడే బ్యాలెన్స్
Advertisement
Ads by CJ

ఈ సంక్రాంతికి థియేటర్స్ లో విడుదలైన సినిమాలన్నీ ఒక్కొక్కటిగా ఓటీటీ కి వచ్చేస్తున్నాయి. థియేటర్స్ లో పొంగల్ బరిలో చివరిగా విడుదలైన శర్వానంద్ నారీ నారీ నడుమమురారి అందరికన్నా, అన్నిటికన్నా ముందే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఆతర్వాత వెంటనే ప్రభాస్ రాజసాబ్ జియో హాట్ స్టార్ నుంచి స్ట్రీమింగ్ లోకి వచ్చింది.  

ఇక మిగిలిన మెగాస్టార్ మన శంకర వరప్రసాద్ గారు ఈ నెల 11 న  జీ 5 నుంచి స్ట్రీమింగ్ లోకి వస్తున్నట్టుగా అఫీషియల్ అనౌన్సమెంట్ ఇచ్చెయ్యగా.. నవీన్ పోలిశెట్టి అనగనగ ఒకరాజు కూడా అదే 11 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్టుగా సదరు ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. 

అదే సంక్రాంతికి విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకున్న రవితేజ భర్త మహాశయులకు మాత్రమే ఓటీటీ డేట్ బ్యాలెన్స్ ఉంది. ఈ చిత్రం ఎప్పుడు ఓటీటీ లోకి వస్తుందో మేకర్స్ ఇవ్వలేదు కానీ.. భర్త మహాశయులకు విజ్ఞప్తి డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న జీ5 ఈ చిత్రాన్ని ఈ నెల 13 నుంచి స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉంది అంటున్నారు.

కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన భర్త మహాశయులకు సినిమాలో రవితేజ, డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ హీరో హీరోయిన్స్ గా  నటించారు. మరి ఈ చిత్రమెప్పుడు ఓటీటీ లోకి వస్తుందో చూద్దాం. 

Bhartha Mahasayulaku Wignyapthi OTT date balance:

Ravi Teja Bhartha Mahasayulaku Wignyapthi OTT date balance

Tags:   RAVI TEJA
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ