Advertisementt

ఫంకీ ట్రైలర్- కామెడీకి కొదవుండదు

Sat 07th Feb 2026 05:58 PM
funky  ఫంకీ ట్రైలర్- కామెడీకి కొదవుండదు
Funky Trailer released ఫంకీ ట్రైలర్- కామెడీకి కొదవుండదు
Advertisement
Ads by CJ

అనుదీప్ కేవీ దర్శకత్వంలో విశ్వక్ సేన్ నటిస్తున్న చిత్రం ఫంకీ. ప్రేమికుల రోజుకు ముందే అంటే ఫిబ్రవరి 13న విడుదలకు సిద్దమవుతున్న ఈ చిత్రాన్ని విశ్వక్ సేన్ ఇంకా దర్శకుడు అనుదీప్, హీరోయిన్ కయ్యదు లోహర్‌ లు ఇంట్రెస్టింగ్ గా ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా మేకర్స్ ఫంకీ ట్రైలర్ ని రిలీజ్ చేసారు.

దర్శకుడు అనుదీప్ పంచ్ లు కామెడీగా వర్కౌట్ అవ్వగా.. విశ్వక్ సేన్ కామెడీ టైమింగ్ కి ఆడియన్స్ పడిపోవాల్సిందే. 4 కోట్ల బడ్జెట్ అని చెప్పి 40 కోట్లు పెట్టించాడంటూ సీనియర్ నరేష్ చెప్పిన డైలాగ్ ఆసక్తిగా అనిపిస్తుంది. విశ్వక్ సేన్-కయ్యదు లోహర్ ల పెయిర్ చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది.

ఫంకీ డైలాగ్స్, టైమింగ్, ప్రెజెంటేషన్, కయ్యదు అందాలు, అనుదీప్ మేకింగ్ అన్ని ఈ చిత్రానికి హైలెట్ గా నిలవబోతున్నాయని ఫంకీ ట్రైలర్ తోనే క్లారిటీ ఇచ్చేసారు. ఫంకీ ఫుల్ ఫన్ ఎంటర్‌టైనర్ గా ఉండబోతుంది అనేది స్పష్టతనిచ్చేసింది. సో ఈసారి విశ్వక్ కి హిట్ తధ్యమనిపిస్తుంది.

Funky Trailer released:

Vishwak Sen and Anudeep KV Bring Comic Chaos Back With FUNKY

Tags:   FUNKY
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ