Advertisementt

AA 22 లో విలన్ గా నేషనల్ క్రష్

Sat 07th Feb 2026 04:37 PM
aa22  AA 22 లో విలన్ గా నేషనల్ క్రష్
Rashmika Unique Role in AA22 AA 22 లో విలన్ గా నేషనల్ క్రష్
Advertisement
Ads by CJ

పుష్ప పార్ట్ 1, పార్ట్ 2 తో హిట్ పెయిర్ గా ట్రెండ్ అయిన అల్లు అర్జున్-రష్మిక మందన్న ముచ్చటగా మూడోసారి కలిసి నటిస్తున్నారు. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న AA 22(వర్కింగ్ టైటిల్) చిత్రంలో మెయిన్ హీరోయిన్ దీపికా పదుకొనె. ఆమెతో పాటుగా మరో ముగ్గురు హీరోయిన్స్ అల్లు అర్జున్ తో కలిసి కనిపిస్తారని అన్నారు.

ఇప్పటికే మృణాల్ ఠాకూర్ AA 22 సెట్ లో జాయిన్ అవ్వగా, తాజాగా నేషనల్ క్రష్ రష్మిక అల్లు అర్జున్-అట్లీ కాంబో మూవీ సెట్ లో అడుగుపెట్టింది అని, ఈ చిత్రంలో రష్మిక నెగెటివ్ షేడ్స్ ఉన్న కేరెక్టర్ లో కనిపించబోతుంది అని తెలుస్తుంది. రష్మిక కేరెక్టర్ నిడివి తక్కువే అయినా చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుంది అని తెలుస్తుంది.

మరి ఇది నిజమా, లేదా అనేది ప్రస్తుతం క్లారిటీ రాలేదు కానీ.. రష్మిక రోల్ పై సోషల్ మీడియాలో మాత్రం విపరీతమైన చర్చ నడుస్తుంది. ఇక మూడో హీరోయిన్ గా జాన్వీ కపూర్ AA 22లో కనిపించబోతుంది అని సమాచారం.

Rashmika Unique Role in AA22:

AA22 - Speculation Grows Over Rashmika Role

Tags:   AA22
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ