Advertisementt

జస్ట్ వన్ డే మూవీస్

Sat 07th Feb 2026 10:38 AM
sumathi satakam  జస్ట్ వన్ డే మూవీస్
Just One Day Movies జస్ట్ వన్ డే మూవీస్
Advertisement
Ads by CJ

నిజమే నిన్న విడుదలైన సినిమాలన్నీ వన్ డే సినిమాలే. జస్ట్ అలా వచ్చి ఇలా వెళ్లిపోయే సినిమాలు. సంక్రాంతి వెళ్లిన తర్వాత వచ్చిన సినిమాలేవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. నిన్న శుక్రవారం పొలోమని చిన్న సినిమాలు చాలానే థియేటర్స్ లోకి దిగాయి. అందులో గుణశేఖర్-భూమిక ల యుఫొరియా మాత్రమే కాస్త ఐడెంటిటీ ఉన్న సినిమా. ఆ తర్వాత అమర్ దీప్ సుమతి శతకం కాస్తో కూస్తో ప్రమోషన్స్ తో ప్రేక్షకులకు చేరింది. ఇక చిదంబరం రెండు ప్రెస్ మీట్లతో సరిపెట్టి.. విత్ లవ్ డబ్బింగ్ మూవీస్ కి ప్రమోషన్స్ లేవు. 

ఆతర్వాత చంద్రహాస్ బారాబర్ ప్రేమిస్తా, బ్లడ్ రోజెస్, హాని, లగ్గం టైమ్ ఇలా చాలా సినిమాలు థియేటర్స్ లో విడుదలయ్యాయి. ఏ సినిమా కూడా ప్రేక్షకులు ఇంప్రెస్స్ చేయలేకపోయాయి. అన్ని ఒక్కరోజు సినిమాలే, నెక్స్ట్ డే కి ఏ సినిమావైపు ప్రేక్షకుడు చూడడు.

అసలే చిన్న సినిమాలకు ఓపెనింగ్స్ ఉండవు, ఏంతో డిఫ్రెంట్ గా ప్రమోషన్స్ చేస్తే తప్ప.. చిన్న సినిమాల కోసం థియేటర్స్ కి ప్రేక్షకుడిని రప్పించడం కష్టమైపోతుంది. మౌత్ టాక్ స్ప్రెడ్ అయితే తప్ప కలెక్షన్స్ రావట్లేదు. మరి నిన్న శుక్రవారం జస్ట్ వన్ డే - ఫన్ డే గా మిగిలిపోయింది. 

Just One Day Movies:

This Week Theatrical Movies

Tags:   SUMATHI SATAKAM
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ