Advertisementt

సీక్వెల్ ట్రెండ్ లో AA 23

Sat 07th Feb 2026 09:54 AM
allu arjun  సీక్వెల్ ట్రెండ్ లో AA 23
AA23 two parts సీక్వెల్ ట్రెండ్ లో AA 23
Advertisement
Ads by CJ

బాహుబలి తర్వాత సీక్వెల్స్ కి ప్రాధాన్యత చాలా పెరిగింది. కొంతమంది సీక్వెల్స్ చేసి దగా పడినా.. మరికొంతమంది సీక్వెల్స్ తో సత్తా చాటారు. ఆ కోవలోకి పుష్ప తో అల్లు అర్జున్ ముందు వరసలో ఉంటాడు. ప్రభాస్ సలార్ హిట్ అయినా పార్ట్ 2 ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. కల్కి, కల్కి 2, దేవర, దేవరా 2 ఇలా సీక్వెల్స్ ట్రెండ్ లోకి అల్లు అర్జున్-లోకేష్ కనగరాజ్ మూవీ కూడా చేరబోతోందట.

ప్రస్తుతం కోలీవుడ్ దర్శకుడు అట్లీ తో AA 22  చేస్తున్నారు. AA 22 కి సంబందించిన షూటింగ్ 25 నుంచి 30 శాతం పూర్తయ్యిందని, ప్రెజెంట్ ముంబై లో జరుగుతున్న షెడ్యూల్ పూర్తయితే అల్లు అర్జున్ పోర్షన్ ఎపిసోడ్ ఎప్పుడు పూర్తి అవుతుంది అనేది తెలుస్తుంది. దానిని బట్టి లోకేష్ ప్లానింగ్ ఉండబోతుందట.

అంటే అల్లు అర్జున్ ఎప్పుడు ఫ్రీ అవుతాడో దానిని బట్టి AA 23 ని స్టార్ట్ చేస్తాడట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో లోకేష్ కనగరాజ్ బిజీగా ఉన్నాడని సమాచారం, అయితే అల్లు అర్జున్-లోకేష్ కనగరాజ్ ల AA 23 రెండు పార్టులుగా రాబోతుంది అనేది లేటెస్ట్ న్యూస్.

AA23 two parts:

Allu Arjun-Lokesh Kanagaraj

Tags:   ALLU ARJUN
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ