ఈమధ్యన థియేటర్స్ లో విడుదలైన సినిమాలు కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు ఓటీటీ లోకి వచ్చేస్తున్నాయి. హిట్ అయిన సినిమా లేదు, ప్లాప్ అయిన సినిమా లేదు, ఏదైనా నాలుగు వారాల గడువులోనే ఓటీటీ లో స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నాయి. నాలుగు వారాలకే ఆడియన్స్ అయ్యో ఇక థియేటర్స్ మనుగడ కష్టమే అని ఫీల్ అవుతుంటే.. ఇప్పుడు ఓ ఓటీటీ డీల్ చూసి ఇది మరీ ఓవరబ్బా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అదే శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి ఓటీటీ డీల్. థియేటర్స్ లో అంచనాలు లేకుండా విడుదల చేసి అమెజాన్ ప్రైమ్ లో మూడు వారాల డీల్ కి ఓటీటీ రైట్స్ అమ్మేసి.. థియేటర్స్ లో హిట్ అయిన సినిమాని మూడు వారాలు తిరిగేసరికి ఓటీటీ లోకి తెచ్చేసి నారీ నారీ మేకర్స్ అందరికి షాకిచ్చారు.
హిట్ సినిమా కనీసం నాలుగు వారాలు థియేటర్స్ లో ఉంచినా నిర్మాతకు ఎంతోకొంత లాభాలు వచ్చేది, కానీ ఓటీటీ డీల్ కి ఆశపడి అమ్మేసారు. అలా హిట్ మూవీ నారీ నారీ నడుమ మురారి మూడు వారాల్లోనే అమెజాన్ ప్రైమ్ నుంచి ఓటీటీ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది.
సంక్రాంతి సినిమాల్లో చివరిగా థియేటర్స్ లో విడుదలైన నారీ నారీ నడుమ మురారి అన్నిటికన్నా ముందే ఓటీటీ లోకి వచ్చేసింది. మరి ఇది ఓవర్ అనిపించడం లేదూ..!





ఉస్తాద్ కోసం పెద్ది ని బలి చేసారా 
Loading..