Advertisementt

బ‌న్నీ లైన‌ప్ లో సింగిల్ లాంగ్వేజ్ సంచ‌ల‌నం

Fri 06th Feb 2026 09:37 AM
allu arjun  బ‌న్నీ లైన‌ప్ లో సింగిల్ లాంగ్వేజ్ సంచ‌ల‌నం
Single language excitement in Allu Arjun lineup బ‌న్నీ లైన‌ప్ లో సింగిల్ లాంగ్వేజ్ సంచ‌ల‌నం
Advertisement
Ads by CJ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తెలివిగా డైరెక్ట‌ర్ల‌ను లాక్ చేస్తున్నాడా?  ద‌ర్శ‌కుల ఎంపిక‌లో మిస్ట‌ర్ ప‌ర్పెక్ట్ అనిపిస్తున్నాడా? అంటే అవున‌నే అనాలి. `పుష్ప 2`  రిలీజ్ అనంత‌రం బ‌న్నీపై చాలా మంది డైరెక్ట‌ర్లు క‌న్నేసినా? ఆయ‌న మాత్రం `జ‌వాన్` తో సంచ‌ల‌నం సృష్టించిన అట్లీ వైపు చూసాడు. `జ‌వాన్` విజ‌యం స‌మ‌యంలోనే అట్లీని ప్ర‌శంసించి ద‌గ్గ‌ర‌య్యాడు.

ఆ ప‌రిచ‌యం ఓ సినిమా వ‌ర‌కూ దారి తీసింది. ఇద్ద‌రి కాంబినేష‌న్ లో గ్లోబ‌ల్ స్థాయిలో ఓ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా సెట్స్ లో ఉండ‌గానే త‌దుప‌రి చిత్రాన్ని కోలీవుడ్ సంచ‌ల‌నం లోకేష్ క‌న‌గ‌రాజ్ తో లాక్ చేసాడు. ఇది బ‌న్నీ 23వ చిత్రం. లోకేష్ గ‌త విజ‌యాల్ని ప్ర‌శంశిస్తూ అప్ప‌ట్లో చేసిన కామెంట్లు ఈ కాంబోకి దారి తీసాయి.

లోకేష్ గ‌త ప‌రాజ‌యంతో సంబంధం లేకుండా  అత‌డి ప్ర‌తిభ‌ను న‌మ్మి అవ‌కాశం క‌ల్పించాడు. ఇంకా సందీప్ రెడ్డి వంగా, ప్ర‌శాంత్ నీల్, రాజ‌మౌళి లాంటి డైరెక్ట‌ర్ల‌కు రెగ్యుల‌ర్ గా ట‌చ్ లో ఉంటున్నాడు. త‌దుప‌రి చిత్రాలు వాళ్ల‌తోనే తీసేలా ప్ర‌ణాళిక సిద్దం చేస్తున్నాడు. తాజాగా ఈ లైన‌ప్ లో బాలీవుడ్ సంచ‌ల‌నం ఆదిధ్య ధ‌ర్ కూడా చేరాడు.

ఇటీవ‌లే రిలీజ్ అయిన `ధురంధ‌ర్` తో ద‌ర్శ‌కుడు ఆధిత్య ధ‌ర్ ఇండియాని షేక్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద  సింగిల్ లాంగ్వేజ్ లోనే 1300 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించింది. ఈ నేప‌థ్యంలో అత‌డి విజ‌యాన్ని కీర్తిస్తూ ట్విట‌ర్లో చేసిన పోస్ట్ అంతే ఆస‌క్తిక‌రం. ఆ త‌ర్వాత ముంబైలో ఆధిత్య ధ‌ర్ ను బ‌న్నీ మీట్ అవ్వ‌డం అంతే ఆస‌క్తికరంగా  మారింది. దీంతో ఇద్ద‌రి కాంబినేష‌న్ లో సినిమా ప‌క్కా అనే వార్త‌లు ముంబై మీడియాలో వైర‌ల్ గా మారాయి. పై ముగ్గురు ద‌ర్శ‌కుల కంటే?  ముందుగానే ఆదిత్య‌తో బ‌న్నీ సినిమా చేసే అకాశాలు ఉన్నాయంటున్నారు.  

Single language excitement in Allu Arjun lineup:

Allu Arjun

Tags:   ALLU ARJUN
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ