దర్శకధీరుడు, పాన్ ఇండియా మేటి దర్శకుడు రాజమౌళి తన సినిమా స్టార్ట్ అయినప్పుడే ఆ సినిమా నేపథ్యం ఏమిటి, సినిమా ఎలా ఉండబోతుంది అనేది అరిటిపండు వలిచి నోట్లో పెట్టినట్టుగా మీడియాకి అందించేస్తారు. ఆతర్వాత అసలు కథ మొదలవుతుంది. కానీ మహేష్ బాబు తో చేస్తున్న సినిమా మొదలైన పది నెలలకు గాని రాజమౌళి వారణాసి విషయాలను మీడియాకి ఇవ్వలేదు.
#GlobeTrotter ఈవెంట్ తోనే వారణాసి గ్లింప్స్ దగ్గర నుంచి మహేష్ బాబు రుద్ర లుక్, ప్రియాంక చోప్రా మందాకినీ లుక్, పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ లుక్ రివీల్ చేసి అసలు వారణాసి ఎలా ఉండబోతుందో గ్లింప్స్ సాక్షిగా స్పష్టత ఇచ్చేసారు. ఆతర్వాత పెద్దగా గ్యాప్ లేకుండానే రిలీజ్ డేట్ లాక్ చేశారు.
ఎప్పుడో వచ్చే ఏడాది రిలీజ్ అవుతున్న సినిమాకి ఇప్పుడు తన హీరో మహేష్, విలన్ పృథ్వీరాజ్, అలాగే ఆయన ఓ ఇంటర్వ్యూ ఇచ్చేసారు. అందులో వారణాసి లో మహేష్ రాముడి గెటప్ కోసం కష్టడింది, అలాగే వారణాసి రెండు పార్టులు కాదు కేవలం సింగిల్ పార్ట్ గానే సినిమా విడుదల అంటూ చెప్పేసారు. ఇన్ని విషయాలు రివీల్ చేసాక సినిమా విషయంలో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ ఎలా వస్తుంది.
చాలామంది దర్శకులు సినిమా విడుదలకు ముందు ట్రైలర్ ఇచ్చే వరకు అసలు కథ, నేపధ్యాన్ని చెప్పరు, ఆ ట్రైలర్ లో హింట్ ఇస్తారు. కానీ రాజమౌళి వారణాసి నేపథ్యం ఆల్మోస్ట్ రివీల్ చేసారు. కానీ ఆ నెక్స్ట్ సినిమాలో పాత్రల ప్రెజెంటేషన్, ఆయన ఇచ్చే ట్విస్ట్ లు, క్వాలిటీ, మేకింగ్, విజువల్స్ అన్నిటి కోసం ప్రేక్షకుడు ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూసేలా రాజమౌళి ప్లానింగ్ ఉంటుంది.
అదే రాజమౌళి విజయ రహస్యం. అన్ని విషయాలు చెప్పి సినిమా విడుదల సమయానికి తన సినిమా పై ఎందుకంత క్రేజ్ పెరుగుతుందో అనేది రాజమౌళి మాయ, ఆయన మ్యాజిక్కే కారణం. సో ఒక్క ఇంటర్వ్యూ తోనే వారణాసి విషయంలో పాన్ ఇండియా ఆడియన్స్ లో విపరీతమైన క్యూరియాసిటీని కల్గించడంలో రాజమౌళి సక్సెస్ అయినట్లే కనిపిస్తుంది.





చిరు కూతురుగా ధురంధర్ పాప
Loading..