రాజమౌళితో సినిమా అంటే మారు మాట్లాడటానికి వీలుండదు. హీరో-హీరోయిన్ సహా నటీనటులు ఎవరైనా ఆయన చెప్పింది చేసుకుంటూ వెళ్లిపోవడమే. ఆయన్ని మించి సూచనలు, సలహాలు ఇద్దామంటే కుదరదు. అందులోనూ హీరోయిన్లు అయితే మాట్లాడటానికి అసలే ఛాన్స్ ఉండదు. కానీ అలాంటి దర్శకధీరుడినే కన్విన్స్ చేసేసింది ప్రియాంక చోప్రా.
ఆయన తెరకెక్కిస్తోన్న `వారణాసి`లో ఈ బ్యూటీ సూపర్ స్టార్ మహేష్ కి జోడీగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఆరేళ్ల తర్వాత ప్రియాంక చోప్రా నటిస్తోన్న భారతీయ చిత్రం కావడంతో సినిమాలో ఓ మంచి పాట ఉండేలా చూడండని కోరింది. అందుకు రాజమౌళి ఎలాంటి టెన్షన్ పడాల్సిన పనిలేదు. మీరు కోరుకున్నని పాటలు ఉన్నాయంటూ బధులిచ్చారు.
ఇలా రాజమౌళిని తన కోసం ఓ పాట పెట్టండి అని ధైర్యంగా ఏ హీరోయిన్ అడిగిన దాఖలాలు ఇంత వరకూ లేవు. ప్రియాంక చోప్రా గ్లోబల్ రేంజ్ ఉన్న నటి కావడంతో? రాజమౌళి వద్ద ఆ ఛాన్స్ తీసుకుంది. ఆమె కోరిక పట్ల రాజమౌళి అంతే వినమ్రంగా స్పందిం చడం విశేషం. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ అంటార్కిటాకు షిప్ట్ అవుతుంది. అక్కడ ఎన్నో సవాళ్ల మధ్య షూటింగ్ నిర్వహించాల్సి ఉంటుందని పీసీ తెలిపింది.
ప్రియాంక చోప్రా హాలీవుడ్ కి వెళ్లిన తర్వాత చాలా బాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ బిజీ షెడ్యూల్ కారణంగా చేయలేకపోయింది. గ్లోబల్ స్థాయిలో ఫేమస్ అయిన తర్వాత పీసీ నటిస్తోన్న భారతీయ చిత్రం ఇదే కావడం విశేషం. అమ్మడి ఇంటర్నేషనల్ ఇమేజ్ `వారణాసి`కి మార్కెట్ పరంగా కీలకమైంది.





రాజాసాబ్ స్ట్రీమింగ్.. ఎక్స్టెండెడ్ కట్తో
Loading..