Advertisementt

యానిమ‌ల్ పార్క్ స్క్రిప్టు మ్యాట‌ర్స్

Thu 05th Feb 2026 03:56 PM
animal park  యానిమ‌ల్ పార్క్ స్క్రిప్టు మ్యాట‌ర్స్
Animal Park movie update యానిమ‌ల్ పార్క్ స్క్రిప్టు మ్యాట‌ర్స్
Advertisement
Ads by CJ

`యానిమ‌ల్`(2023) చిత్రం ర‌ణ‌బీర్ క‌పూర్ కెరీర్ బెస్ట్ హిట్ చిత్రాల‌లో ఒక‌టిగా నిల‌వ‌డ‌మే గాక‌, ఆ ఏడాది బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ చిత్రాల‌లో ఒక‌టిగా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌తిభావంతుడైన సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా న‌టీన‌టులు స‌హా చాలా మందికి కెరీర్ ప‌రంగా బిగ్ బూస్ట్ నిచ్చింది. ఇటీవ‌ల‌  సీక్వెల్ గురించి చాలా చ‌ర్చ సాగుతోంది. సందీప్ వంగా `యానిమ‌ల్ పార్క్` అనే టైటిల్ ని కూడా అధికారికంగా ప్ర‌క‌టించారు.

తాజాగా యానిమ‌ల్ పార్క్ లాంచింగ్ ముహూర్తం గురంచి సందీప్ వంగా ఇచ్చిన స‌మాచారం ఫ్యాన్స్ లో ఉత్కంఠను పెంచుతోంది. తాజా సమాచారం ప్రకారం, `యానిమల్ పార్క్` షూటింగ్ 2027 జూన్ లేదా జూలై నాటికి పట్టాలెక్కే అవకాశం ఉంది. ఈ సీక్వెల్‌లో రణ్‌విజయ్ సింగ్ (రణబీర్ కపూర్) - విల‌న్ అజీజ్ (అచ్చం ర‌ణ్ విజ‌య్‌లానే ఉంటాడు) మ‌ధ్య బిగ్ ఫైట్ ఏమిట‌న్న‌ది తెర‌పై చూపించనున్నారు. అజీజ్ పాత్ర అత్యంత క్రూరంగా దుష్ఠ‌త్వం నిండి ఉంటుంది. అందువ‌ల్ల ఈ సీక్వెల్ లో పోరాటాలు మొదటి భాగం కంటే ఎక్కువ ఉత్కంఠ‌ను క‌లిగించేలా ఉంటాయ‌ని, ఎమోష‌న్స్ పీక్స్ లో ఎలివేట్ అవుతాయ‌ని కూడా చెబుతున్నారు.

రణబీర్ కపూర్ రామాయ‌ణం సిరీస్ సినిమాల‌ను పూర్తి చేసి 2027నాటికి అందుబాటులోకి వ‌స్తారు. అప్ప‌టికి ప్ర‌భాస్ తో స్పిరిట్ చిత్రీక‌ర‌ణ‌ను ముగించి సందీప్ వంగా కూడా అందుబాటులోకి వ‌స్తారు. స్పిరిట్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసాక యానిమ‌ల్ పార్క్ ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నుల్ని కూడా సందీప్ వంగా పూర్తి చేస్తారు. ప్ర‌స్తుత స‌న్నివేశాన్ని బ‌ట్టి, త‌మ ఫేవ‌రెట్ హీరో ర‌ణబీర్ క‌పూర్ ద్విపాత్రాభిన‌యాన్ని వీక్షించేందుకు అభిమానులు చాలా ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు.

Animal Park movie update:

Animal Park movie shooting update

Tags:   ANIMAL PARK
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ