`కల్కి 2` నుంచి దీపిక పదుకొణే తప్పుకోవడంతో? సుమతి పాత్ర విషయంలో సస్పెన్స్ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. చాలా మంది భామల పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ ఏ నటిని ఎంపిక చేసారు? అన్నది అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. సాయి పల్లవిని తీసుకుంటున్నారనే బలమైన ప్రచారం జరుగుతోంది. దాదాపు ఆమె ఎంపిక ప్రక్రియ పూర్తయిందని మీడియాలో కథనాలొస్తున్నాయి.
తాజాగా సాయిపల్లవి ఎంపిక సైతం సందేహాంలో పడిందన్నది మరో వార్త. సుమతి పాత్రకు ఆమె సెట్ అవుతుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పెర్పార్మెన్స్ పరంగా సాయి పల్లవిని ఎంచాల్సిన పనిలేదు. కానీ ప్రభాస్ కి జోడీగా మ్యాచ్ అవ్వడమే కష్టమంటున్నారు. ఇద్దరి మధ్య ఎత్తు వ్యత్యాసమే అందుకు దారి తీస్తోంది. ప్రభాస్ 6.2 కాగా, సాయిపల్లవి ఎత్తు 5.5 మాత్రమే.
దీంతో సాయి పల్లవి ఎంపిక సరైన ఛాయిస్సేనా? అన్నది తెరపైకి వస్తుంది. ప్రత్యామ్నాయంగా మరో నటి పేరు కూడా వినిపిస్తోంది. ఆమె పూజాహెగ్డే. సుమతి పాత్రకు పూజ హెగ్డే అయితే పర్పెక్ట్ గా సెట్ అవుతుందని నాగీ టీమ్ భావిస్తోందిట. పూజను ఎంపిక చేస్తే ఎత్తు సహా ఎలాంటి ఇబ్బందులు ఉండవని ప్రభాస్ పక్కన సరిజోడీగా ఉంటుందని భావిస్తున్నారుట.
అలాగే `రాధేశ్యామ్` కాంబినేషన్ సన్నివేశాలను రిఫరెన్స్ గా తీసుకుని ఎంపిక చేస్తే బాగుంటుందని అనుకుం టున్నారుట. ప్రభాస్- పూజాహెగ్డే `రాధేశ్యామ్` లో జంటగా నటించిన సంగతి తెలిసిందే. సినిమా ప్లాప్ అయినా వెండితెరపై ఆ జోడీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. తెరపై బ్యూటీఫుల్ గా హైలైట్ అయిన జోడీ అది. మరోసారి డార్లింగ్ తో ఛాన్స్ అందుకుంటే? సాయి పల్లవి గొప్ప అవకాశం కోల్పోయినట్లే. మరేం జరుగుతుంది అన్నది చూడాలి.




సినీ నటుడు చంద్రహాస్ కేసు నమోదు 
Loading..