Advertisementt

వైరల్ అవ్వాలంటే ఇలా చెయ్యాలా..

Wed 04th Feb 2026 12:49 PM
chandrahas  వైరల్ అవ్వాలంటే ఇలా చెయ్యాలా..
Barabar Premistha Chandrahas వైరల్ అవ్వాలంటే ఇలా చెయ్యాలా..
Advertisement
Ads by CJ

సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలంటే బూతులు తిట్టాలా, బూతు పదాలతో పాట పాడితే వైరల్ అయిపోతామా ఇదెక్కడి విడ్డురమండి. బుల్లితెర నటుడు ఈటివి ప్రభాకర్ కొడుకు, యాటిట్యూడ్ స్టార్ మొదటి సినిమాతోనే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయ్యాడు, ఇప్పుడు రెండో సినిమా ని పబ్లిసిటీ చేసుకోవడానికి మరీ బరితెగించాడు.

బారాబర్ ప్రేమిస్తా సినిమాని ఈ శుక్రవారం విడుదలకు సిద్ధం చేసిన చంద్రహాస్ ఆ సినిమా ఈవెంట్ లో బూతు లిరిక్స్ తో స్వయంగా పాట పాడి అక్కడి ఆడియన్స్ ని సిగ్గుపడేలా చేసాడు. చంద్రహాస్ పాట పాడుతూ ఉన్న సమయంలో గెస్ట్ గా వచ్చిన నటుడు చక్రవర్తి చూపించిన హావభావాల వీడియోస్ వైరల్ అవుతున్నాయి. 

వైరల్ అవ్వాలంటే ఇంత ఛండాలంగా పబ్లిసిటీ చెయ్యాలా, సినిమా ప్రమోషన్స్ లో ఇలాంటి సంస్కృతా, ఇలాంటి బూతు పదాలేమిటి, ప్రభాస్ గారు మీ కొడుక్కి నేర్పిన సంస్కారం ఇదేనా అంటూ చంద్రహాస్ పై నెటిజెన్స్ మండిపడుతున్నారు. మరి బూతు పాటతో హైలెట్ అవుదామనుకున్న చంద్రహాస్ కి బారాబర్ ప్రేమిస్తా ఎలాంటి రిజల్ట్ అందిస్తుందో చూద్దాం. 

Barabar Premistha Chandrahas:

Chandrahas

Tags:   CHANDRAHAS
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ