Advertisementt

ధురంధర్ 2 టీజర్ ఇదేం ట్విస్ట్

Tue 03rd Feb 2026 03:47 PM
dhurandhar 2  ధురంధర్ 2 టీజర్ ఇదేం ట్విస్ట్
Dhurandhar 2 teaser out ధురంధర్ 2 టీజర్ ఇదేం ట్విస్ట్
Advertisement
Ads by CJ

గత ఏడాది డిసెంబర్ నుంచి స్టిల్ ఇప్పటివరకు మూవీ లవర్స్ నోట్లో నానుతూనే ఉంది రణ్వీర్ సింగ్ నటించిన ధురంధర్. ఆదిత్య దార్ తెరకెక్కించిన ఈ చిత్రం పాన్ ఇండియా ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ లోకి వచ్చి టాప్ 1 గా ట్రెండ్ అవుతుంది.

మార్చ్ 19 న రెండో పార్ట్ విడుదల అనగానే మిగతా లాంగ్వేజ్ లో విడుదల అనుకున్న సినిమాలన్నీ సర్దుకున్నాయి. ధురంధర్ పార్ట్ 2 పై భీభత్సమైన క్రేజ్ నడుస్తుంది. అయితే ధురంధర్ 2 నుంచి తాజాగా టీజర్ వదిలారు. ధురంధర్ గా రణ్వీర్ ఎందుకు, ఎలా మారాడు, అక్కడ కరాచీ ని ఎలా ఎలాడు అనేది ఈ టీజర్ లో చూపించారు.

అయితే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ధురంధర్ ఎండ్ టైటిల్ కార్డ్స్ లో చూపించిన పార్ట్ 2కి సంబందించిన లీడ్ నే మళ్లీ ధురంధర్ 2 టీజర్ అంటూ హడావిడి చేసి వదలడంపై మూవీ లవర్స్ నుంచి విమర్శలు మొదలయ్యాయి. ఆ నెట్ ఫ్లిక్స్ లో చూపించిన వీడియో లోనే చిన్న చిన్న సీన్స్ యాడ్ చేసి ధురంధర్ 2 టీజర్ అంటూ బిల్డప్ ఇచ్చారు.

ధురంధర్ 2 టీజర్ కోసం ఎంతగానోవెయిట్ చేసిన వారికీ ఇది బాగా డిజప్పాయింట్ చేసింది. ఇదేం ట్విస్ట్ గురు అంటూ కామెంట్లు  పెడుతున్నారు.

Dhurandhar 2 teaser out:

Dhurandhar 2 teaser released

Tags:   DHURANDHAR 2
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ