Advertisementt

రీమేక్స్ కాదు ట్రెండ్ ని ఫాలో అవ్వండి

Tue 03rd Feb 2026 10:05 AM
movie  రీమేక్స్ కాదు ట్రెండ్ ని ఫాలో అవ్వండి
Movie remakes రీమేక్స్ కాదు ట్రెండ్ ని ఫాలో అవ్వండి
Advertisement
Ads by CJ

ఆడియన్స్ కొత్తదనం కోరుకుంటున్నారు. ఒకప్పుడు వేరే భాషలో హిట్ అయిన చిత్రాలను తెలుగులో రీమేక్ చేస్తే వర్కౌట్ అయ్యేవి కాదు అక్కడ బ్లాక్ బస్టర్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు రీమేక్ చేస్తే జనాలు థియేటర్స్ కి రావట్లేదు. కారణం ఓటీటీలే. ఏ భాష సినిమా అయినా అవి తెలుగులో డబ్ అయ్యి ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.

ఇతర భాషల్లో హిట్ అయిన మూవీస్ ఎప్పుడెప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతాయా అని కాచుకుని కూర్చుని ఓటీటీ లో వీక్షించేస్తున్నారు సినీ ప్రియులు. అలాంటి సినిమాలను రీమేక్ చేస్తే పరాభవం తప్ప మరేది ఉండదు. మెగాస్టార్ గతంలో మోహన్ లాల్ లూసిఫర్ ని గాడ్ ఫాదర్ గా రీమేక్స్ చేసారు. అదే ఒరిజినల్ అయితే జనాలు థియేటర్స్ కి ఎగబడేవారు. కానీ లూసిఫర్ ని తెలుగులో వీక్షించేసాకే గాడ్ ఫాదర్ గా రీమేక్ చేస్తే అసలు వర్కౌట్ అవ్వలేదు.

తాజాగా దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా మారి మలయాళంలో బేసిల్ జోసెఫ్ హీరోగా దర్శన హీరోయిన్ గా కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన జయ జయ జయ జయహే చిత్రాన్ని తెలుగులో ఓం శాంతి శాంతి శాంతిః గా రీమేక్ చేసారు. ఆ జయ జయ జయహే మలయాళం థియేటర్స్ లో హిట్ అయ్యి తెలుగులో డబ్ అయ్యి ఓటీటీ స్ట్రీమింగ్ లోకి వచ్చింది. ఆ తెలుగు వెర్షన్ అందరూ చూసేసారు.

దానిని తీసుకొచ్చి తెలుగులో ఓం శాంతి శాంతి అంటూ రిమేక్ చేస్తే ఎవరు చూస్తారు. రీమేక్స్ కాదు ఇప్పుడు కొత్త కంటెంట్ తో ఆడియన్స్  ని  ఇంప్రెస్స్ చెయ్యాలి. సినీ ప్రియులు కూడా రీమేక్స్ కాదు ట్రెండ్ ని ఫాలో అవ్వండి.  

Movie remakes:

Movie remakes

Tags:   MOVIE
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ