పవన్ కళ్యాణ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన్ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అస్సలు సపోర్ట్ చెయ్యలేదు. పవన్ ని హీరోగానే చూసారు తప్ప ఆయాన్ని రాజకీయ నాయకుడిగా పవన్ ఫ్యాన్స్ అస్సలు యాక్సెప్ట్ చేయలేకపోయారు. పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్ ని నమ్ముకునే రాజకీయాల్లో ఎదుగుదామనుకున్నా.. వాళ్ళు మాత్రం పవన్ ని రెండు ఎన్నికల్లో మోసం చేసారు.
అదే మాదిరి కోలీవుడ్ హీరో విజయ్ ఫ్యాన్స్ మోసం చెయ్యరు కదా.. హీరోగా విపరీతంగా ఆరాధించిన విజయ్ ని రాజకీయాల్లో ఆరాధిస్తారా, ఆదరిస్తారా, అభిమానుల రెస్పాన్స్ చూసి విజయ్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తాను అని చాలా కాన్ఫిడెంట్ తో చెబుతున్నారు. మరి విజయ్ అభినులు ఆయన్ని పాలిటిక్స్ లో సపోర్ట్ చేస్తే.. నిజంగా అది సెన్సేషన్ అవుతుంది.
అసలే విజయ్ సినిమాలకు బై బై చెప్పేసారు. ఈ ఎన్నికల్లో ఆయన గెలవకపోతే, అభిమానులు మోసం చేస్తే.. మరో ఐదేళ్లు ఆయన మాట తప్పి సినిమాలు చేస్తారో, లేదంటే అలాగే రాజకీయాల కోసం నిలబడతారో అనేది ఆయన అభిమానులు చేతుల్లోనే ఉంది. చూద్దాం విజయ్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అనేది.




ధురంధర్ 2 లో అక్షయ్ ఖన్నాను మిస్ అవుతారు 

Loading..