Advertisementt

టీడీపీ vs వైసీపీ గొడవల్లో లాభపడిన జనసేన

Mon 02nd Feb 2026 02:10 PM
tdp  టీడీపీ vs వైసీపీ గొడవల్లో లాభపడిన జనసేన
TDP vs YCP టీడీపీ vs వైసీపీ గొడవల్లో లాభపడిన జనసేన
Advertisement
Ads by CJ

నిజమే మరి గత రెండు రోజులుగా ఏపీలో టీడీపీ-వైసీపీ మద్యన జరుగుతున్న ఘర్షణతో జనసేన లాభపడింది, కాదు కాదు సేవ్ అయ్యింది. ఎలా అంటారా.. గత రెండు రోజులుగా ఫ్లెక్సీ ల వివాదం కాస్తా వైసీపీ నాయకుల ఇళ్లను తగలబెట్టేవరకు వెళ్లారు టీడీపీ కార్యకర్తలు. చంద్రబాబు, లోకేష్ లను దూషించారంటూ అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లను టీడీపీ కార్యకర్తలు ధ్వంశం చేసారు.

మీడియా మొత్తం అంబటి రాంబాబు, వైసీపీ కార్యకర్తలు vs టీడీపీ కార్యకర్తలు, జోగి రమేష్ vs టీడీపీ కార్యకర్తలు అంటూ ఏకధాటిగా కవర్ చేస్తుంది. మీడియా, సోషల్ మీడియాలో మొత్తం ఇదే ఘర్షణకు సంబందించిన ఫొటోస్, వీడియోస్ వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంలో జనసేన ఎమ్యెల్యే పై వచ్చిన ఆరోపణలన్నీ కనుమరుగైపోయాయి.

రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వచ్చిన లైంగిక ఆరోపణలు ఎంతగా సంచలనం సృష్టించాయో చూసాం. సోషల్ మీడియా, మీడియా మొత్తం అదే కవర్ చేసింది. దానితో జనసేనకు డ్యామేజ్ అవుతుంది అనుకున్న సమయంలోనే ఈ పంచాయితీ మొదలయ్యింది. అంబటి రాంబాబు, జోగి రమేష్ కారు కూతలకు రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు అంబటి ఇంటిని ధ్వంశం చేస్తే.. ఏకంగా జోగి రమేష్ ఇంటికి నిప్పు పెట్టడం సంచలంగా మారింది.

మీడియా వీటిని కవర్ చేసే క్రమంలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ ని వదిలేసింది. దానితో జనసేన చాలావరకు సేవ్ అయ్యింది. లేదంటే మరో వారం జనసేన అరవ శ్రీధర్‌ పేరు మీడియా లోనే కనిపించేది, పవన్ కళ్యాణ్ పై ఒత్తిడి పెరిగిపోయేది. 

TDP vs YCP:

TDP vs YCP - Janasena 

Tags:   TDP
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ