Advertisementt

వాళ్లతో సినిమాలు చేస్తే దర్శకులు కనుమరుగే

Mon 02nd Feb 2026 12:13 PM
adivi sesh  వాళ్లతో సినిమాలు చేస్తే దర్శకులు కనుమరుగే
Siddu Jonnalagadda - Naveen Polishetty- Adivi Sesh వాళ్లతో సినిమాలు చేస్తే దర్శకులు కనుమరుగే
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లో కొంతమంది యంగ్ హీరోలు.. కేవలం హీరోయిజమే కాదు ఇంకా కొన్ని స్పెషల్ టాలేంట్స్ వాళ్లలో దాగి ఉన్నాయి. రైటింగ్ స్కిల్స్, ఎడిటింగ్, స్క్రీన్ ప్లే ఇలా కొన్ని స్పెషల్ టాలెంట్స్ తో ఈ హీరోలు సక్సెస్ ని చూస్తున్నారు. అందులో అడివి శేష్, నవీన్ పోలిశెట్టి, సిద్దు జొన్నలగడ్డ ఒకప్పుడు విశ్వక్ సేన్ అలానే ఉండేవాడు, కానీ ఇప్పుడు విశ్వక్ సేన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వేలు పెట్టడం లేదు. 

అడివి శేష్, నవీన్ పోలిశెట్టి, సిద్దు జొన్నలగడ్డ.. ఈముగ్గురు దర్శకత్వంలో వేలు పెడతారు, దర్శకులను హైలెట్ అవ్వనివ్వరు. ఇది అలా ఉంటే బావుంటుంది, ఇలా ఉంటే బావుంటుంది అని చెబుతారు. దానితో హిట్టు కొడతారు. ఆ హిట్ లో దర్శకులను భాగం కానివ్వరు. అంతా తామే అన్నట్టుగా వ్యవహరిస్తారు.

తాజాగా అనగనగ ఒకరాజు హిట్ అయ్యింది. నవీన్ పోలిశెట్టి సినిమాలో వన్ మ్యాన్ షో, బయట ప్రమోషన్స్ లోను వన్ మ్యాన్ షోస్, దర్శకుడు కనిపించిన, వినిపించిన సందర్భమే లేదు. జనవరి 30 అనగనగ ఒకరాజు 110 కోట్లు కొల్లగొట్టిన సందర్భంగా సక్సెస్ సెలెబ్రేషన్ నిర్వహిస్తున్నారు.

ఈ ఈవెంట్ లో అయినా అనగనగ దర్శకుడు హైలెట్ అవుతాడేమో అనుకుంటే అది లేదు. ఏది ఏమైనా అడివి శేష్, సిద్దు, నవీన్ పోలిశెట్టి లతో సినిమాలు చేస్తే వారు కనుమరుగవ్వాల్సిందే. 

Siddu Jonnalagadda - Naveen Polishetty- Adivi Sesh:

Siddu Jonnalagadda - Naveen Polishetty- Adivi Sesh

Tags:   ADIVI SESH
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ