వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ను గుంటూరు లోని ఆయన నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తతల నడుమ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు ని పోలీసులు అదుపులోకి తీసుకుని నల్లపాడు పీఎస్ కు తరలిస్తున్నారు.
చంద్రబాబు ని నోటికొచ్చినట్టుగా తిట్టిన అంబటి రాంబాబు ని అరెస్ట్ చెయ్యాలంటూ అంబటి ఇంటిపైకి టీడీపీ కార్యకర్తలు, అభిమానులు దూసుకెళ్లారు, అంబటి ఇంటిపై పడి దొరికింది దొరికినట్లుగా విధ్వంశం చేసారు, కారు అద్దాలు పగలగొట్టడమే కాదు, కిటికీ అద్దాలు పగలట్టి అంబటి ఇంట్లోకి దూసుకుపోయారు. పోలీసులు ఎంతగా అడ్డుకున్నా టీడీపీ కార్యకర్తలు ఆగలేదు.
టీడీపీ కార్యకర్తలు, అభిమానుల నిరసన జ్వాలలతో గుంటూరు లోని అంబటి రాంబాబు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. రాంబాబు అరెస్ట్ వార్తల నేపథ్యంలో వైసీపీ అభిమానులు భారిగా చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే అంబటిని అరెస్ట్ చేసి నల్లపాడు పీఎస్ కి తరలించి.. రేపు ఆయన్ను కోర్టు లో హాజరు పరిచే అవకాశం కనిపిస్తుంది.




వారణాసి రెండు టైటిల్స్ అవేనా 
Loading..