మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రం మన శంకర వరప్రసాద్ గారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరు-వెంకీ కలిసి నటించిన మన శంకర వరప్రసాద్ గారు 360 కోట్ల గ్రాస్ తో రికార్డ్ లను సృష్టించింది. సంక్రాంతి సీజన్ లో జనవరి 12 న విడుదలైన ఈ చిత్రం పొంగల్ బ్లాక్ బస్టర్ గా నిలిచి మెగాస్టార్ కి గొప్ప ఊరటనిచ్చింది.
చిరు కి విజయం, నిర్మాతలకు కాసుల పంట, అనిల్ రావిపూడి కి రేంజ్ రోవర్ కారు దక్కాయి. థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ అయిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం ఇప్పుడు ఓటీటీ డేట్ లాక్ చేసుకుంది. మన శంకర వరప్రసాద్ గారు థియేటర్స్ లో విడుదలైన నెల రోజులకు అంటే జనవరి 12 న విడుదలైన ఈ చిత్రం ఫిబ్రవరి 11 న ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అయ్యింది.
మన శంకర వరప్రసాద్ గారు డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 ఫ్యాన్సీ డీల్ తో దక్కించుకోగా.. ఇప్పుడు ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 11 నుంచి స్ట్రీమింగ్ లోకి తేబోతున్నట్టుగా అనౌన్స్ చేసారు. మరి థియేటర్స్ లో మిస్ అయిన ఆడియన్స్ మన శంకర వరప్రసాద్ గారు జీ 5 నుంచి చూసేందుకు రెడీ అవ్వండి.




కేసీఆర్ కు SIT షాక్ 
Loading..