థియేటర్స్ లో దుమ్మురేపిన ధురంధర్ ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ వేదికగా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీ వెర్షన్ లో 10 నుంచి 14 నిమిషాల నిడివి కట్ చేసారు అంటూ ఓటీటీ ఆడియన్స్ గగ్గోలు పెడుతున్నారు. అదలా ఉంటె థియేటర్స్ లో చూసినప్పుడే హీరోయిన్ సారా అర్జున్-రణ్వీర్ సింగ్ కాంబోపై చాలామంది అసంతృప్తిని వ్యక్తం చేసారు. ఇంత చిన్న పిల్లను హీరోయిన్ గా తెచ్చారేమిటీ అని.
ఓటీటీ లో ధురంధర్ ని వీక్షించిన వాళ్ళు సారా అర్జున్ చిన్న పిల్లలా ఉంది, రణ్వీర్ ఆహార్యానికి సారా అర్జున్ సరిపోలేదు, చిన్న పిల్లతో రణ్వీర్ రొమాన్స్ మ్యాచ్ కాలేదు అంటూ మాట్లాడుకుంటున్నారు. రణ్వీర్ సింగ్ కి సరిపోయే హీరోయిన్ ని పెట్టాల్సింది అంటున్నారు. కానీ రణ్వీర్ ఫ్యాన్స్ మాత్రం ధురంధర్ లో ఆమె మెడిసిన్ చదివే అమ్మాయి, రణ్వీర్ హీరోయిజానికి ఫ్యాన్ అయ్యి ప్రేమలో పడింది. వారి జోడి బాగానే ఉంది అంటున్నారు.
సారా అర్జున్ ధురంధర్ కోసం తను ఆడిషన్ ఇచ్చాక నా ఏజ్ పై ధురంధర్ యూనిట్ లో పెద్ద చర్చే జరిగింది అంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. సారా అర్జున్ కేరెక్టర్ పరంగా, లుక్స్ పరంగా ఓకే అయినా.. ఆమె రణ్వీర్ కి మ్యాచ్ కాలేదు అనేది ఓటీటీ ఆడియన్స్ అభిప్రాయం.




ఆ హీరోయిన్ వద్దంటున్న ప్రభాస్ ఫ్యాన్స్ 
Loading..