Advertisementt

అఫీషియల్ - రాజాసాబ్ ఓటీటీ డేట్ ఫిక్స్

Fri 30th Jan 2026 01:04 PM
raja saab  అఫీషియల్ - రాజాసాబ్ ఓటీటీ డేట్ ఫిక్స్
Official - Raja Saab OTT date fixed అఫీషియల్ - రాజాసాబ్ ఓటీటీ డేట్ ఫిక్స్
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ చిత్రం ది రాజాసాబ్. మారుతి దర్శకత్వంలో హర్రర్ కామెడీగా తెరకెక్కిన రాజాసాబ్ అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. రాజసాబ్ ప్రీమియర్స్ నుంచి నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ దిగులు పడిపోయారు. అయినప్పటికి ప్రభాస్ స్టామినా రాజసాబ్ కి భారీ నష్టాలు తీసుకురాకుండా కాపాడింది.

థియేటర్స్ లో డిజప్పాయింట్ చేసిన రాజసాబ్ ఓటీటీ స్ట్రీమింగ్ పై రకరకాల కథలు నడుస్తున్నాయి. మూడు వారాలకే రాజసాబ్ ఓటీటీలోకి వస్తుంది అని, ప్లాఫ్ సినిమా త్వరగానే ఓటీటీలో దిగుతుంది అని కొందరు మాట్లాడుతుంటే ప్రభాస్ ఫ్యాన్స్ బాధ వర్ణనాతీతం, ఇక రాజసాబ్ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ ఫ్యాన్సీ డీల్ తో దక్కించుకుంది.

ఇప్పుడు రాజసాబ్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ని లాక్ చేసింది జియో హాట్ స్టార్. జనవరి 9 న థియేటర్స్ లో విడుదలైన అన్ని లాంగ్వేజెస్ రాజసాబ్ ఫిబ్రవరి 6 నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి తెస్తున్నట్టుగా ప్రకటించారు. మరి థియేటర్స్ ప్లాప్ అయిన రాజసాబ్ ఓటీటీ పెరఫార్మెన్సు ఎలా ఉండబోతుందో చూడాలి. 

Official - Raja Saab OTT date fixed:

The  Raja Saab OTT datelocked

Tags:   RAJA SAAB
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ