అవును బిగ్ బాస్ కి వెళ్లి విన్ అయిన హీరో అభిజిత్ ఆతర్వాత బిగ్ బాస్ కి సంబందించిన ప్రోగ్రాం లో కానీ, స్టార్ మా కి సంబందించిన ఏ ఈవెంట్ లో కానీ కనిపించలేదు. అభిజిత్ విన్నర్ అయ్యాక కేరీర్లో ఎలా ఉన్నా చాలా లో ప్రొఫైల్ మైంటైన్ చేసాడు. బిగ్ బాస్ తర్వాత ఓ వెబ్ సీరీస్ లో కనబడిన అభిజిత్ చాలా ఏళ్లకు బిగ్ బాస్ అగ్నిపరీక్ష కు జెడ్జి గా వచ్చాడు.
ఇప్పుడు అదే మాదిరి అంటే అభిజిత్ లానే మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ తనూజ కూడా చేస్తుంది. బిగ్ బాస్ లో విన్నర్ అవ్వాల్సిన తనూజ రన్నర్ గా నిలిచింది. దానితో హార్ట్ అయ్యిందో, లేదంటే బుల్లితెర మీద ఎక్కువ కనిపిస్తే బిగ్ స్క్రీన్ పై ఆదరణ ఉండదు అనుకుందో ఏమో.. బిగ్ బాస్ అయ్యాక సోషల్ మీడియాలో కూడా కనిపించడం మానేసింది.
బిగ్ బాస్ లో ప్రేమను చూపించి అభిమానించాము, బయటికొచ్చాకా కనీసం ఫొటోస్ కానీ, సోషల్ మీడియాలో కనిపించడం కానీ లేదు అంటూ అభిమానులు ఆమెపై యుద్ధమే చేస్తున్నారు. కానీ తనూజ మాత్రం బిగ్ బాస్ పూర్తయ్యి నెలన్నర అయినా సైలెంట్ గానే ఉంది. ఎలాంటి హడావిడి లేదు.
అప్పట్లో అభిజిత్ అభిమానులను మోసం చేస్తే ఇప్పుడు తనూజ అభిమానులను మోసం చేసింది అంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.




ఫైనల్లీ 1000 కోట్ల హిట్టు బొమ్మ ఓటీటీ లోకి 
Loading..